OG Universe Pawan Kalyan.. ‘ఓజీ’ తర్వాత ఏంటి.? అసలు, ‘ఓజీ’ అంటే ఏంటి.? ‘ఓజస్ గంభీరా’ మాత్రమే కాదు, ‘ఓజీ’ అంటే.!
ఇంతకీ, సుభాష్ చంద్రబోస్‌కీ.. ఆజాద్ హింద్ ఫౌజ్‌కీ.. ‘ఓజీ’కీ లింకేంటి.? ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే, అది ‘ఓజీ’ యూనివర్స్‌తోనే సాధ్యం.
‘ఓజీ’ సినిమాకి సీక్వెల్‌తోపాటు ప్రీక్వెల్ కూడా వుంటుందనీ, రెండూ సైమల్టేనియస్‌గా షూట్ చేసి, ఒకదాని తర్వాత ఇంకోటి విడుదల చేస్తామని దర్శకుడు సుజీత్ ఇటీవల వెల్లడించాడు.
కానీ, ఏపీ డిప్యూటీ సీఎంగా క్షణం తీరిక లేకుండా వున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడున్న పరిస్థితుల్లో ‘ఓజీ’ సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కోసం సమయం కేటాయించగలరా.? అన్నదే బిగ్ క్వశ్చన్.
OG Universe Pawan Kalyan.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పష్టత ఇదీ..
తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైద్రాబాద్‌లో తన అన్నయ్య చిరంజీవి సహా రామ్ చరణ్ తదితరులతో కలిసి ‘ఓజీ’ సినిమాని చూశారు.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, ‘ఓజీ’ టీమ్‌తో కలిసి మెగా ఫ్యామిలీ ఈ సినిమాని చూసిందనడం కరెక్ట్.!

సినిమాని థియేటర్లో చూసిన అనంతరం పవన్ కళ్యాణ్, ఓజీ టీమ్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. తమన్ మ్యూజిక్ గురించీ, సినిమాటోగ్రఫీ గురించి ప్రత్యేకంగా ప్రశంసించారు పవన్ కళ్యాణ్.
దర్శకుడు సుజీత్‌ని అయితే వేరే రేంజ్‌లో ప్రశంసించిన పవన్ కళ్యాణ్, ‘ఓజీ’ యూనివర్స్ కోసం ఎదురుచూస్తున్నా.. అని ప్రకటించేశారు.
సో, ‘ఓజీ’ యూనివర్స్ కన్ఫామ్ అయిపోయినట్లే.! పవన్ కళ్యాణ్ ఇటీవలే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా షూట్‌ని పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.
‘ఓజీ యూనివర్స్’.. రాన్న రెండేళ్ళలో..
‘ఓజీ యూనివర్స్’కి సంబంధించి సీక్వెల్ అలాగే ప్రీక్వెల్.. రానున్న రెండేళ్ళలో పూర్తయిపోతాయా.? అన్నదే ప్రశ్న.
అయితే, పవన్ కళ్యాణ్, చెరో యాభై రోజుల డేట్స్ కేటాయిస్తే.. దర్శకుడు సుజీత్, మిగతా పని చక్కబెట్టేయగలడు.
అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సుజీత్ ఆల్మోస్ట్ సీక్వెల్ అలాగే ప్రీక్వెల్ కోసం ప్రీ-ప్రొడక్షన్ చేసేసుకుని వుండొచ్చని తెలుస్తోంది.
Also Read: ‘ఐ ఫోన్’ కోసం బిచ్చగాళ్ళైపోతున్నారెందుకు.?
చిన్న చిన్న మార్పులు (ఓజీ సంచలన విజయం నేపథ్యంలో) చేసుకుని, పవన్ కళ్యాణ్ డేట్స్ దొరకగానే, సీక్వెల్ అలాగే ప్రీక్వెల్‌ని తెరకెక్కించేయడానికి రెడీ అయిపోతాడు సుజీత్.
‘ఓజీ’తో సుజీత్ వర్క్ చూసినవారికి, సుజీత్ టీమ్.. ‘ఓజీ యూనివర్స్’ని అత్యంత వేగంగా, అత్యంత అద్భుతంగా తెరకెక్కించగలదనే బలమైన నమ్మకం కలగడంలో వింతేమీ లేదు.
