Hrithik Roshan Emotional Note.. ఏ దర్శకుడైనా, ఏ నిర్మాత అయినా.. నటీనటులెవరైనా, ఓ కథని నమ్మి ముందడుగు వేస్తారు. సినిమా విజయం సాధించొచ్చు, అపజయం పాలవ్వొచ్చు.
సినిమా ఫెయిలవుతుందని ఎవరైనా, ఏ ప్రాజెక్టు అయినా చేస్తారా.? చెడ్డ పేరు మూటగట్టుకోవాలని అనుకుంటారా.?
‘వార్-2’ సినిమా విషయంలోనూ అంతే. అయాన్ ముఖర్జీ, హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీయార్.. చాలా బలంగా నమ్మారు, ‘వార్-2’ కథని. కానీ, అది వర్కవుట్ కాలేదు.
సినిమా 360 కోట్లకు పైగా వసూళ్ళు సాధించిందంటూ, నెంబర్లు అయితే ప్రచారంలో వున్నాయి. కానీ, ‘వార్-2’ చాలా పెద్ద డిజాస్టర్.
Hrithik Roshan Emotional Note.. నూటికి నూరు శాతం కష్టపడాల్సిందే..
తాజాగా, హృతిక్ రోషన్ ‘వార్-2’ సినిమాపై స్పందించాడు. సోషల్ మీడియా వేదికగా ఓ ఎమోషనల్ నోట్ రాశాడు. ఆ నోట్ సారాంశం ఏంటంటే..
‘వార్-2’ సినిమాలో కబీర్ పాత్రను చాలా సరదాగా పూర్తి చేశాననీ, ఈ ప్రాజెక్ట్ గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి నాకు చాలా సులభం అనిపించిందన్నాడు హృతిక్.
‘ఎవరికైనా చెప్పేది ఒక్కటే. దేన్నైనా తేలిగ్గా తీసుకోండి. ఒక నటుడిగా మీ బాధ్యతను నూటికి నూరు శాతం చేయండి, మీ పని మీరు పూర్తి చేసే ఇంటికి రండి.. ఈ సినిమా విషయంలో నేనూ అదే చేశా’నని హృతిక్ చెప్పాడు.
‘నేను చేయాల్సింది చేశాను. దర్శకుడు అయాన్ ముఖర్జీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. షూటింగ్ జరిగినన్ని రోజులూ ఆయన ఎనర్జీ చూసి నాతో పాటు, మా టీమ్ అందరిలోనూ ఉత్సాహం పెరిగింది..’
‘ఎక్కడా రాజీ పడకుండా ప్రతి సన్నివేశాన్నీ క్షుణ్ణంగా పరిశీలించి రూపొందించారు. ప్రతి సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకంతోనే చిత్రీకరిస్తాం..’ అని హృతిక్ పేర్కొన్నాడు.
కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ఎప్పుడూ హృతిక్ మనసులో రెండు ఆలోచనలుండేవట. ‘ఇది చాలా సులభం.. నువ్వు చేయగలవు..’ ఇవే ఆ ఆలోచనలట.
ప్రతి సినిమాకూ గాయాలయ్యేలా చిత్ర హింసలు పడుతూ వుండాల్సిన అవసరం లేదు. రిలాక్స్‌గా పని చెయ్ అని నా మనసు చెబుతుండేది. అందుకే దీన్ని సరదాగా పూర్తి చేశాను.. అని హృతిక్ రోషన్ ప్రస్తావించాడు.
హృతిక్ ఎమోషనల్ పోస్ట్ చూసి, అతని అభిమానులు మరింత ఎమోషనల్ అవుతున్నారు. ‘వార్-2’ సినిమాలో కియారా అద్వానీ ఫిమేల్ లీడ్‌గా నటించిన సంగతి తెలిసిందే.
Also Read: ‘ఫుడ్డు’ కోసం కొట్టుకు ఛస్తారెందుకు.?
హృతిక్, జూనియర్ ఎన్టీయార్.. పోటా పోటీగా ‘వార్-2’ సినిమా ప్రమోషన్లు చేశారు. ఇప్పుడిక, హృతిక్ ఎమోషనల్ నోట్ తర్వాత, జూనియర్ ఎన్టీయార్ నుంచి నోట్ రావాల్సి వుందన్నమాట.
అంతే, కొన్నిసార్లు.. కొన్ని సినిమాలు చేదు ఫలితాల్ని ఇస్తాయి. సక్సెస్, ఫెయిల్యూర్.. దైవాదీనం అంటారందుకే.!
కానీ, ఆ సినిమాల షూటింగ్స్ జరుగుతున్నంతకాలం, చోటు చేసుకున్న ఘటనలు మాత్రం.. జీవితాంతం మధుర జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి.
