Table of Contents
Poruginti Pullakoora Tollywood PR Mafia.. ‘మీకు తెలియదు సార్ మా కష్టాలు.. పీఆర్ మాఫియా మమ్మల్ని బతకనివ్వడంలేదు’ అంటూ ఓ నిర్మాత కన్నీరు మున్నీరయ్యారు.!
ఆయన సాదా సీదా నిర్మాత కాదు.! యువకుడేగానీ, ఓ ప్రముఖ నిర్మాత. అగ్ర హీరోలతో సినిమాలు తీసిన, తీస్తున్న యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ అతను.!
‘చిమ్టూ’ అని అతన్ని, సన్నిహితులు పిలుచుకుంటుంటారు. సోషల్ మీడియాలోనూ అదే పేరుతో ఆయన మీద ట్రోలింగ్ జరుగుతుంటుంది కూడా.!
Poruginti Pullakoora Tollywood PR Mafia..అసలేంటీ పొరుగింటి పుల్లకూర.?
తెలుగులో ఓ పెద్ద సినిమా రిలీజ్ అయ్యింది.! కానీ, ఆ సినిమాకి ప్రీమియర్స్ వేసేందుకు థియేటర్లు చివరి నిమిషం వరకూ దొరకని పరిస్థితి.
అదే, ఓ పర భాషా సినిమా అయితే, రాత్రికి రాత్రి ప్రీమియర్స్ కోసం పెద్ద సంఖ్యలో థియేటర్లు దొరుకుతాయి. వాటికి పెయిడ్ ప్రమోషన్లు కూడా అనూహ్యంగా జరుగుతాయ్.

ఇన్‌ఫ్లూయెన్సర్లతో పర భాషా సినిమాలకు అనుకూలంగా ప్రమోషన్స్ చేయిస్తారు.. వేలల్లో, లక్షల్లో ఫాలోవర్స్ వున్న సినీ ఎర్నలిస్టులతో, పెయిడ్ ట్వీట్లు (సానుకూలంగా) వేయించబడతాయ్.
ఇదంతా చేసేది ‘పీఆర్’ టీమ్.! అరే, మన తెలుగు సినిమా కూడా రిలీజ్ అవుతోంది కదా.? అంటే, తెలుగు సినిమాని చంపెయ్, పర భాషా సినిమాకి పెయిడ్ హైప్ క్రియేట్ చెయ్.. అంటారక్కడ.
ప్రెస్ మీట్లలో పనికిమాలిన ప్రశ్నలేయిస్తారు.!
ఓ సూపర్ హిట్ సినిమా టీమ్, తమ సినిమా రిలీజ్‌కి ముందు ప్రెస్ మీట్ పెడితే.. పనిమాలిన సినీ ఎర్నలిస్టులతో, దర్శకుడ్ని ర్యాగింగ్ చేస్తూ ప్రశ్నలేయించింది ఓ పీఆర్ బృందం.
హీరో బాగా హర్టయ్యాడు.. చిన్నోడే అయినా, తెగించి.. క్లాసులు పీకాడు సినీ ఎర్నలిస్టులకి. దర్శకుడు చిన్నబుచ్చుకున్నాడు. కానీ, సినిమా చాలా పెద్ద హిట్.
హీరోయిన్ల పుట్టుమచ్చల గురించీ, ఎఫైర్ల గురించీ, డివోర్స్ గురించీ.. సినీ ఎర్నలిస్టులతో దిక్కుమాలిన ప్రశ్నలు వేయించేది కూడా ఈ పీఆర్ మాఫియానే కావడం గమనార్హం.
వెబ్ మీడియాలో ‘పీఆర్’ వాటాలు.?
మీడియా ప్రతినిథులకు ఇవ్వాల్సిన ‘కవర్లు’ కొట్టేయడం దగ్గర్నుంచి, వెబ్ మీడియా నుంచి కమిషన్లు లాగడమే కాదు, వాటిల్లో వాటాలు కూడా సొంతం చేసుకుంటున్న పీఆర్ టీమ్స్ కూడా వున్నాయ్.
ఎలాగోలా ఏడుస్తున్నారులే.. అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే, వీళ్ళకి పొరుగింటి పుల్లకూర రుచి ఎక్కువ.! తినేది తెలుగు సినీ పరిశ్రమలో, కానీ.. పాజిటివ్ పీఆర్ చేసేది పర భాషా సినిమాలకి.
Also Read: వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఓ ‘ఉచిత సలహా’.!
వీళ్ళ గోల భరించలేక, వీళ్ళ బ్లాక్‌మెయిల్ తట్టుకోలేక.. సినిమాలు నిర్మించడం మానేసి, పర భాషా సినిమాల డబ్బింగ్ రైట్స్ కోసం ఎగబడుతున్నారు కొందరు ప్రముఖ నిర్మాతలు.
అన్నట్టు, ఈ పీఆర్ మాఫియాలోనూ, ‘కమ్మ’టి కుల మాఫియా, చిన్నా చితకా పీఆర్‌లను నాశనం చేస్తుండడం అత్యంత దురదృష్టకరం.
