Coldrif Cough Syrup Banned.. చిన్న పిల్లల విషయంలో తల్లి దండ్రులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తుంటారు. పసి పిల్లలంటే, కంటి పాపలు కదా మరి.!
అలాంటి పసి పిల్లలకు ఏదన్నా చిన్న అనారోగ్యం సంభవిస్తే, తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన చెందడం సహజమే.! హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్ళిపోతుంటారు చాలామంది.
మరి, సరైన వైద్య సౌకర్యాలు లేని చోట ఏం జరుగుతుంది.? అందుబాటులో వున్న, ఏదన్నా మెడికల్ షాప్‌కి వెళ్ళి, అక్కడ దొరికే మందుల్ని వినియోగిస్తుంటారు.
సదరు, మెడికల్ షాప్‌కి సరైన లైసెన్స్ వుందా.? అక్కడ మందులు విక్రయించేవారికి అనుభవం వుంటుందా.? డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు ఇవ్వకూడన్న జ్ఞానం వాళ్ళకి వుంటుందా.?
అసలు సమస్య ఇదే..
చాలా గ్రామాల్లో, వైద్య సౌకర్యాలు సరిగ్గా వుండవు. దాంతో, జ్వరం, జలుబు, దగ్గు, తలనొప్పి.. వంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలకి, నేరుగా మందుల షాపులో మందులు కొనెయ్యడమే.!
మెడికల్ షాప్‌లు కూడా, అధిక లాభాల కోసం, అడ్డగోలుగా మందుల్ని విక్రయించేస్తుంటాయి. వీటిల్లో నాసిరకం మందులే ఎక్కువగా విక్రయించబడుతుంటాయి.
ఫలితం, చిన్న చిన్న అనారోగ్య సమస్యలే, పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలకు కారణమవుతాయి. ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్యులుగా చెలామణీ అవుతూ, నడిపే మాఫియా కథ మళ్ళీ వేరే.!
Coldrif Cough Syrup Banned.. కోల్డ్రిఫ్.. కొంప ముంచేసింది..
కోల్డ్రిఫ్ అనే దగ్గు మందు, మధ్య ప్రదేశ్‌లో పలువురు చిన్నారుల ప్రాణాల్ని తీసేసింది. దాంతో, దేశవ్యాప్తంగా దగ్గు మందు వినియోగంపై ఆందోళన నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వివిధ రాష్ట్రాల్ని హెచ్చరించింది. ఆయా రాష్ట్రాల్లో ‘కోల్డ్రిఫ్’ దగ్గు మందుపై నిషేధం విధించడమూ జరిగిపోయింది.
అదొక్కటేనా.? ఇంకా ఇలాంటివి ఇంకేమైనా వున్నాయా.? అన్న కోణంలో ఆయా రాష్ట్రాల్లో అధికారులు, మందుల దుకాణాలపైనా, మందుల తయారీ సంస్థలపైనా దృష్టి పెట్టారు.
Also Read: రష్మిక, విజయ్.. ఇంత రహస్యమెందుకు.?
అసలంటూ, రెండేళ్ళ లోపు పిల్లలకు దగ్గు మందు పట్టకూడదన్న వాదన ఒకటి తెరపైకొచ్చిందిప్పుడు. మరి, ఆ వయసు పిల్లలకి దగ్గు వస్తే ఏం చెయ్యాలి.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.
చిన్న అనారోగ్య సమస్య అయినా.. వైద్యుల్ని సంప్రదించాల్సిందే. అది పిల్లల విషయంలో అయినా, పెద్ద వాళ్ళ విషయంలో అయినా.!
