BiggBossTelugu9 Amma Nanna.. ఆమె అతనికి అమ్మ.! అతను, ఆమెకి నాన్న. ఇదింటే.. ఇది బిగ్ బాస్ బంధుత్వం. ఏదన్నా టాస్క్ వస్తే, ఇద్దరూ పోటీదారులైపోతారు.!
బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో తొమ్మిదో సీజన్లో ఈ ‘తాత్కాలిక’ బంధుత్వాలు ఒకింత చిరాగ్గా వున్నాయన్నది నిర్వివాదాంశం.
బంధుత్వాలు కలుపుకున్నవారిలో సంజన, ఇమ్మాన్యుయేల్, తనూజ, భరణి.. ప్రముఖంగా వున్నారు. గత సీజన్లలో కూడా ఇలాంటివి చూశాం.!
BiggBossTelugu9 Amma Nanna.. అమ్మ.. నాన్న.. ఓ కొడుకు..
అయినాగానీ, ఇవేం బంధుత్వాలు.? అలా పిలుచుకోవడం ఎంత ఛండాలంగా వుందో తెలుసా.? అంటూ నెటిజనం మండిపడుతున్నారు.
సంజనని అమ్మా.. అని పిలుస్తాడు ఇమ్మాన్యుయేల్. భరణి, తనూజని అమ్మా.. అని పిలుస్తాడు. చిత్రంగా తనూజ, భరణిని నాన్నా అని పిలుస్తుంది.
అన్న.. అనే పిలుపు సర్వసాధారణం బిగ్ బాస్ హౌస్లో. కానీ, ఈ ‘అమ్మ’ అన్న పిలుపు ఏంటి.? ‘నాన్న’ అన్న ప్రస్తావన ఏంటి.?
Also Read: 25 వేల టన్నుల గోల్డ్.. మనదే.!
అమ్మ.. నాన్న.. ఇవి చాలా ప్రత్యేకమైనవి. కలుషితం కానివి. బిగ్ బాస్ రియాల్టీ షో సందర్భంగా టాస్కులు వస్తే, కంటెస్టెంట్లు పోటీదారులుగా మారిపోతారు.
అలా పోటీదారులయ్యాక.. తిట్టుకోవడం, కొట్టుకోవడం సర్వసాధారణం. ఇక, హౌస్ నుంచి ఎలిమినేషన్ కోసం నామినేషన్స్ చేయాల్సి వస్తుంది.
బంధుత్వాల నడుమ.. ఇదెంతవరకు సబబు.? అన్న ప్రశ్న ఆడియన్స్ మెదళ్ళలో మెదలకుండా ఎలా వుంటుంది.?
అందుకే, బిగ్ బాస్ చూస్తున్నంతసేపూ, అందులో కంటెస్టెంట్లు ఈ బంధుత్వాలు కలిపేసుకుని మాట్లాడుతోంటే, ఎబ్బెట్టుగా వుంటోంది వ్యవహారం.!
ప్రధానంగా తనూజ, ఈ ‘బిగ్ బాస్ బంధుత్వాలతో’ వీక్ అయిపోతోంది.!
