Deepika Padukone Mental Health.. పదో తరగతి పరీక్షల్లో ఫెయిలయితే బలవన్మరణం.! ప్రేమించిన అమ్మాయి, హ్యాండిస్తే బలవన్మరణం.!
వేధిస్తున్న తలనొప్పి, కడుపు నొప్పి.. వంటి అనారోగ్య సమస్యలకీ బలవన్మరణమే సమాధానమైతే.? అప్పుల బాధలు, ఇతరత్రా సమస్యలు.. మనుషుల్ని చంపేస్తోంటే.!
చాపకింద నీరులా, ‘మానసిక సమస్యలు’ మానవాళిని మింగేస్తోంది. క్యాన్సర్ కంటే భయంకరమైనదిగా మారిపోతోంది, మానసిక అనారోగ్య సమస్.
Deepika Padukone Mental Health.. లైట్ తీసుకునే విషయమే కాదిది.!
భారత ప్రభుత్వం, బాలీవుడ్ నటి దీపిక పదుకొనేని ‘మానసిక ఆరోగ్యంపై అవగాహన’కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడం అంతటా చర్చనీయాంశమయ్యిది.
దీపిక పదుకొనే మాత్రమే ఎందుకు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంది. దీపిక పదుకొనే, ప్రముఖ బాలీవుడ్ నటి. బోల్డంత ఫాలోయింగ్ ఆమెకి వుంది నటిగా.!

అంతే కాదు, దీపిక పదుకొనే కూడా మానసిక అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఈ విషయాన్ని ఆమె గతంలోనే చెప్పింది.
అయితే, వైద్య చికిత్స తర్వాత, మానసిక అనారోగ్య సమస్య నుంచి కోలుకున్నట్లు దీపిక పదుకొనే పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
సెలబ్రిటీలు.. సామాన్యులు.. మానసిక సమస్యలు..
మానసిక అనారోగ్య సమస్యలపై చికిత్స విషయమై సామాన్యుల్లో ఇంకా సరైన అవగాహన రాలేదు. మానసిక సమస్య.. అనగానే, ‘మెంటల్’ అనే మాటే గుర్తుకొస్తుంది.
అంటే, పిచ్చోళ్ళని బాధిదుల మీద ముద్ర వేసేస్తుంటుంది సమాజం. ఈ క్రమంలోనే, మానసిక సమస్యలతో వైద్యుల్ని సంప్రదించడానికి మొహమాటపడుతుంటారు బాధితులు.
అందుకే, మానసిక అనారోగ్య సమస్యలకు సంబంధించి ప్రచారం, అవగాహన తప్పనిసరి. ఆ ప్రచారం కూడా, అలాంటి సమస్య ఎదుర్కొని, చికిత్సతో కోలుకున్న సెలబ్రిటీలు చేస్తే ఇంకా మంచిది.
Also Read: 25 వేల టన్నుల గోల్డ్.. మనదే.!
కేంద్ర ప్రభుత్వం అదే చేసింది.! గతంలో, క్యాన్సర్ బారిన పడ్డ క్రికెటర్ యువరాజ్ సింగ్, క్యాన్సర్‌పై అవగాహనా కార్యక్రమాల్ని స్వచ్ఛందంగా చేపట్టాడు, కొనసాగిస్తున్నాడు కూడా.
నిజానికి, మానసిక అనారోగ్య సమస్యలపై సెలబ్రిటీలు మాట్లాడితే, అప్పటికది హాట్ టాపిక్ అవుతుంటుంది. ఇలా ప్రచారకర్తగా సినీ ప్రముఖుల్ని నియమిస్తే, సమాజానికి అది మేలు చేస్తుంది.
