Telusu Kada Review.. ‘డీజే టిల్లు’తో రాత్రికి రాత్రి స్టార్‌డమ్ సంపాదించుకున్న సిద్దు జొన్నలగడ్డ నుంచి తాజాగా వచ్చిన సినిమా ‘తెలుసు కదా’.!
‘టిల్లు’ మ్యాజిక్ నుంచి బయటకు వచ్చేందుకు చేసిన సినిమా అని, ‘తెలుసు కదా’ ప్రమోషన్ల సందర్భంగా సిద్దూ జొన్నలగడ్డ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే.
టీజర్‌లో ఓవర్ డోస్ రొమాన్స్, ఓ వర్గం ఆడియన్స్‌కి ‘సినిమా చూడాల్సిన అవసరమే లేదు’ అనే భావన కలిగించింది.
అయితే, ‘మీరు అనుకుంటున్నంత లేదు’ అంటూ ఆ వర్గం ఆడియన్స్‌ని చిత్ర యూనిట్ కన్విన్స్ చేసేందుకు చాలా ప్రయత్నించింది.
సినిమా ప్రోమోస్.. అంటే, టీజర్ అలాగే ట్రైలర్.. వాటితోపాటు ఆడియో సింగిల్స్, సినిమాపై ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేశాయి.
రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ ‘తెలుసు కదా’ సినిమాలో సిద్దు జొన్నలగడ్డ సరసన హీరోయిన్లుగా నటించారు. ఇంతకీ, ‘తెలుసు కదా’ సినిమాలో అసలేముంది.?
Telusu Kada Review.. తెలుసు కదా.. కథా కమామిషు ఇదీ..
హీరో, హీరోయిన్ పెళ్ళి చేసుకుంటారు.. వైవాహిక బంధంలో ఓ చిన్న సమస్య.. ఆ సమస్యని ఎదుర్కొనే క్రమంలో, ఇంకో పెద్ద సమస్య.!
చిన్న సమస్య ఏంటి.? పెద్ద సమస్య ఏంటి.? ఆ సమస్య నుంచి హీరో, హీరోయిన్ ఎలా బయటపడ్డారన్నది మిగతా కథ.! ఇదొక రొమాంటిక్ డ్రామా.! ఎమోషనల్ డ్రామా కూడా.!
చాలా సినిమాలు ఇలాంటివి చూసేశాం.! కాకపోతే, కాన్‌ఫ్లిక్ట్ పాయింట్, కొంచెం కొత్తది. నీరజ కోన, కొత్త కాన్‌ఫ్లిక్ట్ పాయింట్ అయితే రాసుకోగలిగిందిగానీ, కథని అందంగా చెప్పే క్రమంలో తడబడింది.

ఫస్టాఫ్ బాగానే వుంది కదా.. అనిపించేలోపు, సెకెండాఫ్ గందరగోళానికి గురిచేసింది. సెకెండాఫ్‌లో కథని ఎటు తీసుకెల్ళాలో తెలియక టీమ్ మొత్తం గందరగోళానికి గురయినట్లుంది.
సినిమాటోగ్రఫీ, మ్యూజిక్.. బాగానే సపోర్ట్ చేసినా, సెకెండాఫ్‌లో గందరగోళం నుంచి ప్రేక్షకుడికి ప్రశాంతత అయితే దొరకదు.
వైవా హర్ష కామెడీ టైమిండ్, సినిమాకి అదనపు అడ్వాంటేజ్ అయ్యింది. అదే సమయంలో, అన్నపూర్ణ కామెడీ చాలా చాలా చిరాకు పుట్టించింది.
లీడ్ యాక్టర్స్ గురించి ముందుగా మాట్లాడుకోవాలి కదా.! సరే, మాట్లాడేసుకుందాం. సిద్దు జొన్నలగడ్డ కామెడీ టైమింగ్ గురించి కొత్తగా చెప్పేదేముంది.?
ఈసారి ఎమోషనల్ సీన్స్‌లోనూ నటుడిగా ఆకట్టుకున్నాడు. సినిమాని పూర్తిగా తన భుజాల మీద మోసేందుకు ప్రయత్నించాడు.
నటనా ప్రతిభ కోణంలో చూస్తే, రాశి ఖన్నాకీ అలాగే శ్రీనిధి శెట్టికి కూడా మంచి మార్కులే పడతాయి. గ్లామరే కాదు, యాక్టింగ్ కూడా ఇద్దరూ బానే చేశారు.
హీరో బాగా చేశాడు కదా.. హీరోయిన్లూ బాగా చేశారు కదా.. వైవా హర్ష కామెడీ కూడా వర్కవుట్ అయ్యింది కదా.? ఇంకేంటి సమస్య.? అంటే, అసలు ట్విస్ట్ అక్కడే వుంది.
చక్కగా మొదలైన సినిమా, ఇంటర్వెల్‌కి వచ్చేసరికి ఆసక్తికరంగా మారినా, ఆ తర్వాత నీరసం ఆవహిస్తుంది. బోర్ కొట్టడం ఒక యెత్తు.. గందరగోళం ఇంకో యెత్తు.!
‘మీరు వుమనైజరా’ అంటూ, మహిళా జర్నలిస్టు ఫోర్స్‌డ్‌గా ప్రెస్ మీట్‌లో ఓ ప్రశ్న అడగడం, అది వివాదాస్పదమవడం తెలిసిన విషయమే.
Also Read: విశాఖ అభివృద్ధికి ఇంకెన్ని దశాబ్దాలు కావాలి.?
ఆ జర్నలిస్ట్ గురించి ఓ ఇంటర్వ్యూలో తాను చెప్పదలచుకున్నది చెప్పాడు సిద్దు జొన్నలగడ్డ. ఆ వివాదం, సినిమా గురించి జనం ఇంకాస్త గట్టిగా మాట్లాడుకోవడానికి కారణమయ్యింది.
పాత్రల్ని బాగా డిజైన్ చేసినా, ఆ పాత్రలు క్రమంగా సహజత్వానికి దూరంగా బిహేవ్ చేస్తుంటాయి. దాంతో, ఇటు ప్రేక్షకుడికి ఆయా పాత్రలు ఏం చేస్తున్నాయో అర్థం కాని పరిస్థితి.
ఓవరాల్‌గా, ఓ మంచి పాయింట్ వృధా అయ్యిందన్న భావన కలుగుతుంది సినిమా చూశాక. ఓటీటీకి అలవాటు పడిపోయిన ప్రేక్షకులు, థియేటర్లకు వెళ్ళాలంటే, ఇలాంటి కంటెంట్‌తో కష్టమే.!
పోనీ, ఓటీటీలో వచ్చాక చూస్తారా.. అంటే, అక్కడా అంత టైమ్ వృధా చేసుకోవడమెందుకనే భావనలో ఆడియన్స్ వుంటోన్న పరిస్థితిని చూస్తున్నాం.
