Liquor Driving Is Terrorism.. మద్యం సేవించి, వాహనాలు నడపడం చట్ట రీత్యా నేరం.! ఔను, అందుకే.. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటారు.!
టెస్టులు చేస్తారు సరే.. దొరికిన వాళ్ళకి ఎలాంటి శిక్షలు విధిస్తారు.? జరీమానాలు విధిస్తారు, అప్పుడప్పుడూ కొందరికి జైలు శిక్ష పడుతుంటాయి కూడా.!
‘నేను తాగి వాహనం నడిపాను’ అనే బోర్డు ఒకటి మెడలో వేసుకుని, కూడళ్ళలో.. కొందర్ని ట్రాఫిక్ పోలీసులు నిలబెట్టడం కూడా చూశాం గతంలో.!
Liquor Driving Is Terrorism.. టెర్రరిస్టులు.. మానవ బాంబులు..
సీనియర్ ఐపీఎస్ అధికారి, హైద్రాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు సోషల్ మీడియా వేదికగా, మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై.
ఒక్కరి నిర్లక్ష్యం.. 20 మందిని ప్రాణాలను బలితీసుకుంది మద్యం మత్తులో వాహనాలతో రోడ్డుపైకి వచ్చి అమాయకుల ప్రాణాలను పొట్టనబెట్టుకునే వాళ్లు టెర్రరిస్టులు, మానవ బాంబులు కాక ఇంకేమవుతారు.. చెప్పండి!!
వాళ్ళు చేసిన ఈ తప్పిదం వల్ల ఎన్ని కుటుంబాలు మానసిక క్షోభను అనుభవిస్తున్నాయి. మీ సరదా, జల్సా కోసం ఇతరుల ప్రాణాలను తీసే హక్కు మీకు ఎవరిచ్చారు!?
సమాజంలో మన చుట్టే తిరిగే ఇలాంటి టెర్రరిస్టులు, మానవ బాంబుల పట్ల జాగ్రతగా ఉండండి. వీరి కదలికలపై వెంటనే డయల్ 100 కి గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వండి.
చూస్తూ చూస్తూ వాళ్ళను ఇలాగే వదిలేస్తే రోడ్డు మీదకు వచ్చి ఎంతో మందిని చంపేస్తారు. వారిని మాకెందుకులే అని వదిలేస్తే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది.
ఇదీ హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్, సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్.!
ఇది అక్షర సత్యం.! కర్నూలులో జరిగిన రోడ్డు ప్రమాదం, ఆ ఘోర ప్రమాాదానికి కారణం మద్యం సేవించిన బైకర్ అవడం.. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోవడం.. దారుణాతిదారుణం.
తీవ్రవాద దాడుల్లో కూడా ఇంత మంది ఒకేసారి చనిపోవడం అరుదుగా జరుగుతుంటుంది. జరిగిన ఘటన, ‘మానవ బాంబు’ని తలపిస్తోందన్నది నిర్వివాదాంశం.
కానీ, తప్పతాగి డ్రైవింగ్ చేసి, ప్రమాదాలకు కారణమయ్యేవారికి ఎలాంటి శిక్షలు విధిస్తున్నాం.? 20 మంది ప్రాణాలు తీసిన బైకర్ కూడా అదే ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు.
అందుకే, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో మందు బాబులకు కఠిన శిక్షలు విధించాలి. తీవ్రవాదులు, మానవ బాంబులకు విధించే శిక్షల్లాంటివి అయితేనే మార్పు వస్తుందేమో.!
Also Read: విశాఖలో గూగుల్ డేటా సెంటర్: వైసీపీని ముంచేసిన జగన్.!
ఇదే సందర్భంలో, రవాణా శాఖ సహా ట్రాఫిక్ విభాగం.. వీటిల్లో అవినీతి కూడా, ప్రమాదాలకు కారణమవుతున్న విషయాన్ని విస్మరించలేం.
రాజకీయ అవినీతి, అన్ని అనర్థాలకీ కారణం. ఆ లెక్కన, తీవ్రవాదులు.. మానవ బాంబులు.. అన్ని విభాగాల్లోనూ వున్నట్లే కదా.?
హైద్రాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఐపీఎస్ ట్వీట్ ఇంగ్లీషులో..
Drunk drivers are terrorists. Period. Drunk drivers are terrorists and their actions are nothing short of acts of terror on our roads.
The horrific #Kurnool bus accident, which claimed the lives of 20 innocent people, was not an accident in the truest sense.
It was a preventable massacre, caused by the reckless and irresponsible behaviour of an intoxicated biker. This was not a road mishap but a criminal act of negligence that annihilated entire families within seconds.
The biker, identified as B. Shiva Shankar, was under the influence of alcohol. CCTV footage shows him refueling his motorcycle at 2:24 a.m., minutes before he lost control and caused the devastating collision at 2:39 a.m.
His decision to drive drunk turned a moment of arrogance into a tragedy of unimaginable scale. I stand firmly by my statement that DRUNK DRIVERS ARE TERRORISTS in every sense.
They destroy lives, families, and futures. Such acts will never be tolerated. In #Hyderabad, we are adopting a zero-tolerance stance against drunk driving.
Every single person caught driving under the influence will face the full force of law. There will be no leniency, no exceptions, and no mercy for those who endanger innocent lives.
It’s time we, as a society, stop calling drunk driving a mistake. It is a crime that shatters lives and must be punished accordingly.
