Ys Jagan Padayatra Again.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతంలో పాదయాత్ర చేశారు. పాదయాత్రలు.. అనాలేమో.!
నారా లోకేష్ కూడా, 2024 ఎన్నికలకు ముందర పాదయాత్ర చేశారు. అంతకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు కూడా పాదయాత్ర చేయడం చూశాం.
వైఎస్ షర్మిల, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఓ సారి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ తరఫున ఇంకోసారి పాదయాత్ర చేయడం చూశాం.!
పాదయాత్రలు, రాజకీయ పార్టీలకు అధికారం తెస్తాయా.? అంటే, ఈ ట్రెండ్ తెలుగు రాష్ట్రాల్లో మొదలు పెట్టింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయన, పాదయాత్ర ద్వారానే అధికారంలోకి వచ్చారు.
నిజానికి, పొలిటికల్ వాక్యూమ్‌కి పాదయాత్రలు అడ్వాంటేజ్ అవుతాయంతే. ఆ వాక్యూమ్ లేనప్పుడు, పాదయాత్ర చేసి ప్రయోజనం లేదని, తెలంగాణలో షర్మిల చేసిన పాదయాత్రతో తేటతెల్లమైంది.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇంకోసారి పాదయాత్ర చేయబోతున్నారట. అదీ, 2027లో ఈ పాదయాత్ర ప్రారంభమవుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెబుతోంది.
Ys Jagan Padayatra Again.. పాదయాత్ర ఈ రోజుల్లో.. కష్టమే.!
ఒకప్పటి పాదయాత్రలకీ, ఇప్పటి పాదయాత్రలకీ చాలా చాలా తేడా వుంది. ఇప్పుడు పాదయాత్రలు అంత తేలిక కాదు. డబ్బులిచ్చి తెచ్చుకునే జనాల్ని కంట్రోల్ చేయడం పెద్ద తలనొప్పి వ్యవహారం.
ఒక్కోసారి, డబ్బులిచ్చినా జనాల్ని రప్పించుకోలేని దుస్థితి కూడా ఎదురవ్వొచ్చు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పాదయాత్ర కష్టాలు అనుభవమే.
జగన్ ఇంకోసారి, ఆ రిస్క్ తీసుకోవడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఖర్చు.. అనేది అత్యంత కీలకమైన వ్యవహారం.
ఒకప్పుడు వైసీపీ కోసం ఆ పార్టీ నేతలు చేసిన ఖర్చులు, ఆనాటి పరిస్థితులు వేరు. ఇప్పుడు మారిన పరిస్థితుల్లో వైసీపీ నాయకుల ఆలోచనలు వేరు.
రాజకీయాల్లో చిత్ర విచిత్రమైన, అత్యంత వికృతమైన పోకడల్ని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. అది వైసీపీకే శాపంగా మారాయి.
2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణం, వైసీపీ అనుసరించిన విధానాలే. ఇంకో పదేళ్ళు.. ఆ పాపాన్ని వైసీపీ కడిగేసుకోలేదు. ఇదైతే నిజం.
అయితే, 2027కి ఇంకా చాలా సమయం వుంది. ఈలోగా వైఎస్ జగన్ ఆశించే పొలిటికల్ వాక్యూమ్ కనిపిస్తే, జగన్ పాదయాత్రకు సానుకూలంగా పరిస్థితులు మారతాయి.
Also Read: డాలర్ డ్రీమ్స్ వద్దే వద్దు.! మన భారతమే ముద్దు.!
కానీ, అప్పటికి జనసేన పార్టీ మరింత బలంగా మారుతుంది గనుక, ఈసారి పాదయాత్ర వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అంత సానుకూల ఫలితాలు అయితే ఇచ్చే అవకాశం లేదు.
రోజుకి, ఒక్కో మనిషికీ మూడు వేలు సమర్పించుకుంటే తప్ప, పాదయాత్రలో తన వెంట ‘కార్యకర్తల’ ముసుగేసి, జగన్ తిప్పుకోలేని పరిస్థితి ఇప్పుడే వుంది.
అప్పటికి, ఈ ‘రేటు’ ఇంకా భారీగా పెరిగిపోవచ్చు. తట్టుకుంటుందా వైసీపీ ఆ ఖర్చుని.? వైసీపీ నేతలు, తగిన రీతిలో నిథుల్ని సమకూర్చుకోగలరా.?
‘ఖర్చులు భరించలేం.. పాదయాత్ర అనవసరం..’ అంటూ వైసీపీ శ్రేణుల్లో అప్పుడే, వైఎస్ జగన్ పాదయాత్ర మీద ‘విరుపులు’ షురూ అయ్యాయ్.!
