Kiran Abbavaram Ramp Publicity.. కిరణ్ అబ్బవరం అంటే, కేవలం నటుడు మాత్రమే కాదు.. నిర్మాత కూడా.! దర్శకత్వం సహా, సినిమాకి సంబంధించిన అన్ని విభాగాలపైనా పట్టున్నోడు.!
‘కె-ర్యాంప్’ సినిమా విషయంలో కొంచెం ఓవర్ ది బోర్డ్ అయ్యాడు. కథ ఎంపికలో ‘కమర్షియల్’ ఆలోచనలు గట్టిగా చేసి, హద్దులు దాటేశాడు, బూతుల విషయంలో.
ఆ సినిమాలో పాత్ర అలాంటిది.. అని కిరణ్ అబ్బవరం బుకాయించొచ్చుగాక.! సినిమా విడుదలైన రోజే, ఆడియన్స్ పెదవి విరిచారు.
నిజానికి, ప్రోమోస్ వచ్చాకనే, ‘ఇది మనం చూసే సినిమా కాదు’ అని చాలామంది ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. సినిమాకి రివ్యూలు కూడా ‘సానుకూలంగా’ రాలేదు.!
Kiran Abbavaram Ramp Publicity.. బ్లాక్‌మెయిల్.. పబ్లిసిటీ స్టంట్..
కానీ, నిర్మాతని ఓ వెబ్ సైట్ చేసిన బ్లాక్‌మెయిల్ వ్యవహారం.. ‘కె-ర్యాంప్’కి కలిసొచ్చింది. సింపతీ క్రియేట్ అయ్యింది ‘కె-ర్యాంప్’ మీద.
వసూళ్ళు సినిమాకి సరిగ్గా వచ్చాయా.? లేదా.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి. కానీ, సినిమాని హీరో కిరణ్ అబ్బవరం ‘లైమ్ లైట్’లో వుంచడానికి, ఆ వివాదం పనికొచ్చింది.
చివరికి, అదంతా డ్రామా.. అన్నట్లుగా ‘కె-ర్యాంప్’ నిర్మాత, సదరు వెబ్ సైట్‌కీ, మరో వెబ్ సైట్‌కీ క్షమాపణ చెప్పేశాడు.
Also Read: సన్ గ్లాసెస్ వాడుతున్నారా? మీరివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
దాంతో, అప్పటిదాకా ‘కె-ర్యాంప్’ సినిమాకి అండగా నిలిచినవాళ్ళంతా షాక్‌కి గురయ్యారు. ఏదైతేనేం, సినిమాని ‘లైమ్‌లైట్’లో వుంచగలిగింది ‘కె-ర్యాంప్’ టీమ్.
బహుశా, ఇదంతా కిరణ్ అబ్బవరం ‘టాలెంటే’ అయి వుంటుందంటూ, సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమైతే, ఆ విషయంలో కిరణ్ అబ్బవరం ‘ర్యాంప్’ అంతే.!
ఈ మొత్తం ఎపిసోడ్, ఓటీటీ పరంగా ‘కె-ర్యాంప్’కి బాగా కలిసొచ్చి వుండొచ్చన్న అభిప్రాయం అంతటా వినిపిస్తోంది. నిజమేనా.?
‘కె-ర్యాంప్’ సినిమాలో కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించిన సంగతి తెలిసిందే.
అన్నట్టు, ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సీనియర్ నటుడు నరేష్ పోషించిన క్యారెక్టర్ మీదనే మరింత ఎక్కువగా ‘బూతు’ నెగెటివిటీ కనిపించింది.
