Chicken Narayana Ibomma Hidma.. ఎవరీ నారాయణ.? చికెన్ నారాయణ అంటార్లే.! కాదు కాదు, ‘ఎర్ర’ నారాయణ అంటారు.!
సీపీఐ నాయకుడు నారాయణ అనగానే, ముందుగా గుర్తుకొచ్చేది చికెన్.!
కొన్నాళ్ళ క్రితం గాంధీ జయంతి రోజున, చికెన్ తిని.. వార్తల్లోకెక్కాడీయన.! ఎవరి ఆహారపుటలవాట్లు వాళ్ళవి. కానీ, రాజకీయ నాయకుడు కదా, కొంత బాధ్యత వుండాలి.
గాంధీ జయంతి రోజున మద్యం, మాంసం.. నిషేధం.! అంటే, దుకాణాల వరకే లెండి.. ఆ బ్యాన్.! ముందుగానే కొనుక్కుని తెచ్చుకుని, ఆరగిస్తే.. ఎవరు మాత్రం కాదనగలరు.?
ఆగండాగండీ, రేటు ఎక్కువైతే మాత్రం, చికెన్ కొనుక్కోకుండా కొట్టేస్తే ఎలా.? అదీ కరెక్టే.! కానీ, నారాయణ వాదన ఇంకోలా వుంది.! రేటెక్కువ కాబట్టి, దొంగతనం చేయొచ్చట.
సినిమా టిక్కెట్ ధరలు ఎక్కువగా వుంటున్నాయి కాబట్టి, ఐబొమ్మలో పైరసీ సినిమాలు చూశానని నారాయణ చెప్పుకొచ్చారు.! పైగా, ఐబొమ్మ రవిని హీరో.. అంటున్నారాయన.
అక్కడితో ఆగితే, ఆయన నారాయణ ఎలా అవుతారు.? మావోయిస్టు అగ్ర నేతల్లో ఒకరైన హిడ్మాతో పోల్చారు ఐబొమ్మ రవిని నారాయణ.!
నాన్సెన్స్కి పరాకాష్ట ఈ పోలిక.! హిడ్మా, తను నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలు తీశాడు, ప్రాణాలు కోల్పోయాడు కూడా.! సరే, హిడ్మా విషయమై భిన్నాభిప్రాయాలు.. అది వేరే చర్చ.
కానీ, ఐబొమ్మ రవి అనే ‘దొంగ’తో, హిడ్మాని పోల్చితే.. ఎవర్ని ఎక్కువ చేసినట్లు? ఎవర్ని తక్కువ చేసినట్లు.? నారాయణకైనా తెలుసా.? లేదా.?
సినిమా టిక్కెట్ల ధరలు తగ్గకపోతే, ఐబొమ్మ రవి లాంటోళ్ళే పుట్టుకొస్తారట. హిడ్మా లాంటి వాళ్ళని ఒకర్ని చంపితే, వంద మంది పుట్టుకొస్తారట. ఇదీ నారాయణ దిక్కుమాలిన సిద్ధాంతం.!
చికెన్ రేటు పెరుగుతోంది.. అంటే, ఏం చెయ్యాలి.? కోళ్ళను దొంగతనం చెయ్యాలా.? బహుశా, చికెన్ నారాయణ చేస్తున్నది అదేనేమో.! నవ్విపోదురుగాక ఆయనకేటి సిగ్గు.?
బిగ్ బాస్ రియాల్టీ షో అంటే, ఆయనకి నచ్చదు. అలాగని, బిగ్ బాస్ రియాల్టీ షోని ఉద్దేశిస్తూ ‘బ్రోతల్’ వ్యాఖ్యల్ని చేయడమేంటి.? దటీజ్ నారాయణ.!
