Balayya Boyapati Akhanda2 Failure.. ‘అఖండ-2’ సినిమాకి సంబంధించి ఖర్చు లెక్కలు తీస్తే, హీరో నందమూరి బాలకృష్ణ అలానే దర్శకుడు బోయపాటి శ్రీను.. రెమ్యునరేషన్లే ఎక్కువ.!
ఇదే విషయం, సినిమా విడుదలకు ముందు విపరీతంగా సర్క్యులేట్ అయ్యింది కూడా.! రెమ్యునరేషన్లు కాకుండా సినిమా కోసం ఎంత ఖర్చు చేశారు.? అన్నదానిపై భిన్నవాదనలున్నాయి.
సినిమా రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడింది. అలా వాయిదా పడ్డానికి కారణం, ఆర్థిక ఇబ్బందులే.! దీనిపైనా రకరకాల ప్రచారాలున్నాయి.
ఏ సమస్య వున్నా, హీరో అలానే దర్శకుడు గనుక గ్యారంటీ ఇచ్చి వుంటే, ‘అఖండ-2’ సినిమా నిన్న ఎలాంటి ఆటంకాలూ లేకుండా విడుదలయి వుండేదే.
బాలయ్య, బోయపాటి.. ఇద్దరూ కలిసి, ‘అఖండ-2’ సినిమా బాధ్యతని తీసుకుని వుండాల్సింది. జస్ట్ గ్యారంటీనే కదా, సినిమా రిలీజయ్యాక ఎటూ, రికవరీ అయిపోతుంది కదా.?
ప్చ్.. ఆ నమ్మకం అటు బాలయ్యకిగానీ, ఇటు బోయపాటికిగానీ లేకుండా పోయిందేమో. అందుకే, రాత్రికి రాత్రి ‘అఖండ-2’ సినిమాని గాలికొదిలేశారన్న చర్చ జరుగుతోంది సినీ వర్గాల్లో.
చాలామంది హీరోలు, ఇలాంటి సమస్యలు వస్తే, ‘రెమ్యునరేషన్ గురించి తర్వాత చూసుకుందాం’ అంటారు. ఇదే విషయాన్ని ఇటీవల ఓ ప్రముఖ హీరో చెప్పారు కూడా.
మరి, 14 రీల్స్ బ్యానర్ విషయంలో, హీరో నందమూరి బాలకృష్ణ ఎందుకు మొహం చాటేసినట్లు.? పైగా, ఈ సినిమా నిర్మాణంలో బాలయ్య కుమార్తె కూడా భాగం పంచుకున్నారాయె.
బాలయ్య అభిమానుల్లో కొందరు, ‘సీఎం చంద్రబాబు ఒక్క ఫోన్ కాల్ చేసి వుంటే, సమస్య వచ్చేది కాదు’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.
సీఎం ఫోన్ చేస్తే తప్ప, తన సినిమా రిలీజ్ అవనంత దుస్థితిలో నందమూరి బాలకృష్ణ వున్నారా.? అన్నది ఇప్పుడు తోటి అభిమానుల్ని వేధిస్తున్న ప్రశ్న.
నందమూరి బాలకృష్ణ కేవలం సినీ నటుడే కాదు, టీడీపీ ఎమ్మెల్యే కూడా.! అయినా, మేనేజ్ చేయలేకపోవడమేంటో.! పైగా, ‘మా బ్లడ్డు వేరు.. మా బ్రీడు వేరు..’ అంటుంటారు బాలకృష్ణ.
ఏదిఏమైనా, ‘అఖండ-2’ సినిమా రిలీజ్ చివరి నిమిషంలో వాయిదా పడ్డం, ఆర్థిక ఇబ్బందులు.. ఇదంతా ఓ గుణపాఠంగానే చూడాలేమో.!
