Meenakshi Chaudhary Wedding Gossips.. బ్యాక్ టు బ్యాక్ భలే మంచి అవకాశాలొస్తున్నాయ్ మీనాక్షి చౌదరికి. కొన్ని ఫ్లాపులు ఎదురైనా, ప్రస్తుతం మీనాక్షి చౌదరి ట్రాక్ రికార్డ్ బానే వుంది.!
తొలి సినిమా ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే, ఇప్పుడున్న హీరోయిన్లలో కాస్త వేగంగా, కాస్త మంచి సినిమాలు చేస్తున్నది మీనాక్షి చౌదరి మాత్రమేనేమో.
‘సంక్రాంతికి వస్తున్నాం’తో పెద్ద హిట్ కొట్టిన మీనాక్షి, ‘లక్కీ భాస్కర్’ సినిమాతోనూ మంచి హిట్‌ని తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే.
తాజాగా, మీనాక్షి చౌదరి పెళ్ళంటూ ఓ పుకారు వెబ్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ షికారు చేసేస్తోంది. సోషల్ మీడియా సంగతి సరే సరి.
Meenakshi Chaudhary Wedding Gossips.. పుకార్లు ఎలా పుట్టాయ్.?
ఇంతకీ, మీనాక్షి చౌదరి పెళ్ళి నిజమేనా.? అసలేంటి కథ.? సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మీనాక్షి చౌదరి.
ఆ తొలి సినిమా నుంచే సుశాంత్, మీనాక్షి మధ్య ‘లవ్’ షురూ అయ్యిందన్నది, గత కొంతకాలంగా వినిపిస్తున్న గాసిప్స్ సారాంశం.

మొన్నీమధ్యన ఓ సినీ వేడుక కోసం దుబాయ్ వెళ్ళిన మీనాక్షి, సుశాంత్.. అక్కడ చెట్టాపట్టాలేసుకు తిరిగారనీ, పెళ్ళి షాపింగ్ జరిగిపోయిందనీ పుకార్లు జోరందుకున్నాయి.
దాంతో, మీనాక్షి చౌదరి ఉలిక్కిపడింది. తన టీమ్ ద్వారా, పుకార్లకు చెక్ పెట్టే ప్రయత్నం చేసిందట. టీమ్ వరకూ ఎందుకు, సోషల్ మీడియా వేదికగా ఓ స్టేట్మెంట్ ఇచ్చేస్తే సరిపోయేది కదా.?
Also Read: చెవికో నగ.! అదిరెను అందాల సెగ.!
అయినా, సినీ ప్రముఖులకి ఈ పుకార్ల ముప్పు కొత్తేమీ కాదు.! కొన్ని పుకార్లు నిజమవుతాయి కూడా.! ఏమో, మీనాక్షి చౌదరి చుట్టూ నడుస్తున్న గాసిప్స్ ముందు ముందు ఏమవుతాయో.!
ఇంతకీ, ఈ పుకారుని పుట్టించిందెవరు.? నిప్పు లేకుండానే పొగ పుడుతుందా.? ఆరా తీస్తే, ఇదిప్పటి పుకారు కాదు.. ఎప్పటిదో.. కొత్తగా, మసాలా దట్టించి మళ్ళీ వదిలారంతే.!
