Anasuya Bharadwaj Madatha Mancham.. అలా సాయంత్రం సమయంలో.. మడత మంచంపై సేద తీరితే.. ఆ కిక్కే వేరప్పా.! అయినా, ఇప్పుడు మడత మంచాలెక్కడున్నాయ్.?
ఏం, ఎందుకు లేవు.? పల్లెటూళ్ళలో ఇప్పటికీ మడత మంచాలున్నాయ్.. అవే సాయంకాలపు ముచ్చట్లున్నాయ్.!
పట్టణాల్లో అయితే, మడత మంచాలు కొనుక్కోగలం.. కానీ, అందమైన సాయంకాలాన్ని ఎలా కొని తెచ్చుకోగలం.? ఛాన్సే లేదు.!
అందుకే కదా.. ఫామ్ హౌస్లు వున్నవి.! సిటీకి దూరంగా ఫామ్ హౌస్ వుంటే, వారాంతాల్లో అక్కడికి వెళ్ళి సరదాగా కాలక్షేపం చేసి రావొచ్చు.
వ్యవసాయం చేసుకోవచ్చు.. పల్లెటూరి వాతావరణాన్ని పట్టణపు హంగులతో ఎంజాయ్ చేయడానికి ఈ ఫామ్ హౌస్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
Anasuya Bharadwaj Madatha Mancham.. సాయంత్రం.. అనసూయ అందం..
అలా ఓ ఫామ్ హౌస్లో.. మడత మంచమ్మీద.. ఇదిగో, అనసూయ ఇలా సరదా సాయంకాలాన్ని ఎంజాయ్ చేస్తూ, ఆ ఫొటోల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.
చక్కనమ్మ ఏం చేసినా సక్కగానే వుంటుంది మరి.! ఇక, సోషల్ మీడియాలో అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలకి కామెంట్లు పోటెత్తుతున్నాయ్.

ఫామ్ హౌస్లో రంగమ్మత్త.. అందాల జాతర.. అంటూ, సెటైర్లేస్తున్నారు కొందరు.! అయినా, ఇక్కడ అందాల జాతర ఏముంది.? పద్ధతిగానే కదా కనిపిస్తోంది.. అని ఇంకొందరంటున్నారు.!
అటు సినిమాలు.. అప్పుడప్పుడూ బుల్లితెరపై రకరకాల షోలు.. వీటికి తోడు సెలబ్రిటీగా షాప్ల ఓపెనింగులు.. వెరసి, అనసూయ వెరీ వెరీ బిజీ.!
మొన్నీమధ్యనే విదేశాలకు కుటుంబంతో సహా వెకేషన్ నిమిత్తం వెళ్ళింది అనసూయ.! ఇప్పుడేమో ఇలా వీకెండ్, ఫామ్ హౌస్లో సేదతీరడం.. చక్కనమ్మ ఏం చేసినా అందమే మరి.!
ఒకప్పుడేమో జబర్దస్త్ అనసూయ.. ఇప్పుడైతేనే, ‘రంగమ్మత్త’ అనసూయ.!
ఎన్ని సినిమాలు చేసినా, సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘రంగస్థలం’ సినిమాలోని రంగమ్మత్త పాత్రకు ధీటైన పాత్ర ఇంకోటి అనసూయకి దక్కుతుందా.?
ప్చ్.. దక్కదేమో.. అందుకే, ‘రంగమ్మత్త’ అనేది అనసూయకి ఇంటిపేరులా మారిపోయింది.
