Pawan Kalyan Gift Sujeeth.. వీరాభిమానికి తన అభిమాన హీరో నుంచి ఖరీదైన బహుమతి అందితే.!
అయినా, పవన్ కళ్యాణ్ నుంచి ఆప్యాయంగా అందే ‘హగ్’ కంటే, విలువైన బహుమతి ఏ అభిమానికైనా ఇంకేముంటుంది.?
‘ఓజీ’ సినిమాతో తోటి అభిమానులకు బోల్డంత ఆనందాన్నిచ్చిన దర్శకుడు సుజీత్, తన అభిమాన నటుడు పవన్ కళ్యాణ్ నుంచి ఖరీదైన బహుమతి అందుకున్నాడు.
సుజీత్‌కి ల్యాండ్ రోవర్ డిఫరెండర్ కారుని పవన్ కళ్యాణ్ తాజాగా బహూకరించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Pawan Kalyan Gift Sujeeth.. హయ్యస్ట్ గ్రాసర్ ఓజీ..
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఓజీ’ సినిమా ఎంతటి ఘన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.!
2025లో హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది ‘ఓజీ’ సినిమా.! అన్ని ఏరియాల్లోనూ లాభాల పంట పండించింది ‘ఓజీ’.!
అసలు సినిమా పూర్తవుతుందా.? అన్న సందేహాల నడుమ, సినిమా పూర్తయి.. ప్రేక్షకుల ముందుకొచ్చేసి, సంచలన విజయాన్ని ‘ఓజీ’ అందుకుంది.

సుజీత్ దర్శకత్వం, తమన్ సంగీతం.. ‘ఓజీ’ సినిమాకి ప్రధాన ఆకర్షణలు. ప్రియాంక మోహన్ ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్‌గా నటించింది.
చిన్నప్పటినుంచీ పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అయిన సుజీత్, తన అభిమాన నటుడ్ని ఎలా చూడాలనుకున్నాడో అలానే తెరపై చూపించాడు.
Also Read: ప్రియాంక చోప్రా.. టాలీవుడ్‌లో డబుల్ ధమాకా.!
సినిమా ప్రమోషన్లలోనూ పవన్ కళ్యాణ్ మీద తన అభిమానాన్ని సుజీత్ చాటుకుంటూ వచ్చాడు. ఆ అభిమానానికి గుర్తింపుగా, ఖరీదైన కారు పవన్ కళ్యాణ్ నుంచే బహుమతిగా అందింది.
అన్నట్టు, పవన్ కళ్యాణ్‌తోనే ‘ఓజీ’కి సీక్వెల్ అలాగే ప్రీక్వెల్ తెరకెక్కించనున్నాడు సుజీత్.!
