Jagan Chandrababu Crimes Courts.. వైఎస్ జగన్, అక్రమాస్తుల కేసులో నిందితుడిగానే వున్నారు.! బెయిల్ మీదున్నారు ప్రస్తుతం వైఎస్ జగన్, ఆయా కేసుల్లో.!
ఏళ్ళ తరబడి, అక్రమాస్తుల కేసు విచారణ కొనసాగుతూ.. సాగుతూ.. వస్తోంది.! ప్రస్తుతానికి వైఎస్ జగన్, నిందితుడు మాత్రమే.! ‘దోషి’గా ఎప్పుడు జగన్ తేలతాడన్నది కాలమే సమాధానం చెప్పాలి.!
ఇక, వైఎస్ జగన్ హయాంలోనే చంద్రబాబుపై స్కిల్ స్కామ్.. అంటూ, కేసులు నమోదు చేయించి, అరెస్టు కూడా చేయించడం చూశాం.!
ఆ కేసులో చంద్రబాబు బెయిల్ మీద బయటకు వచ్చారు. అక్రమాస్తుల కేసులో జగన్ 16 నెలలు జైల్లో వుంటే, స్కిల్ స్కామ్‌లో దాదాపు రెండు నెలలపాటు చంద్రబాబు జైల్లో వున్నారు.
Jagan Chandrababu Crimes Courts.. క్రిమినల్ కేసులే.. పదవుల్నిస్తాయ్.!
రాజకీయ నాయకులపై క్రిమినల్ కేసులనేవి, వాళ్ళకి అదనపు శక్తిని అందిస్తాయ్.! అక్రమాస్తుల కేసు లేకపోతే, వైఎస్ జగన్ రాజకీయంగా రాటుదేలేవారు కాదేమో. ముఖ్యమంత్రి అయ్యేవారు కాదేమో.!
సేమ్ టు సేమ్.. చంద్రబాబుకీ అదే వరిస్తుంది. స్కిల్ స్కామ్ అనే ప్రస్తావనే లేకపోతే, చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం సాధ్యపడేది కాదేమో.!

తెలంగాణలో, ఓటుకు నోటు కేసు.. రేవంత్ రెడ్డిని సీఎం పీఠమెక్కించింది. ఇదంతా జనాల్లో జరుగుతున్న చర్చ.! ఆయా నాయకులు, నిందితులుగానే వుంటారు ఎప్పటికీ.
ఈ విషయం అందరికన్నా బాగా తెలుసు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.! కానీ, తాజాగా చంద్రబాబు మీద విమర్శలు సంధిస్తూ, చంద్రబాబుని దోషిగా నిలబెడతామంటూ ప్రగల్భలాలు పలికేశారు జగన్.
Also Read: ఇంట్లో దెయ్యం.. నాకేం బయ్యం.!
దోషిగా నిర్ధారించేది న్యాయస్తానం మాత్రమే.! న్యాయస్థానం ముందర ఎవర్నయినా నిందితుడిగా మాత్రమే నిలబెట్టగలరు.!
అక్రమాస్తుల కేసులో 16 నెలల పాటు జైల్లో వున్న జగన్.. సుదీర్ఘ కాలంగా బెయిల్ మీదున్న జగన్.. ‘దోషిగా చంద్రబాబుని నిలబెడతా’ అనడం హాస్యాస్పదం కాక మరేమిటి.?
వ్యవస్థలు అలా తగలడ్డాయ్.. జగన్ లాంటి రాజకీయ నాయకుల దృష్టిలో చులకనైపోయాయ్.!
