Ram Charan Roshan Shankar Dada.. వెండితెరపై శంకర్ దాదాతో ఏటీఎం చేసిన హంగామాని ఎలా మర్చిపోగలం.?
నిజ జీవితంలోనూ అన్నదమ్ముల్లా వుండే చిరంజీవి, శ్రీకాంత్.. సిల్వర్ స్క్రీన్ మీద చెలరేగిపోయారు.!
మళ్ళీ అలాంటి కాంబినేషన్ సెట్ అయితే.? అది కూడా, మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్, శ్రీకాంత్ తనయుడు రోషన్.. కలిసి ఓ సినిమాలో నటిస్తే.?
ఏదో సినిమాలో ఎందుకు.? ‘శంకర్ దాదా’ సిరీస్‌లోనే ఇంకో సినిమా సెట్ చేస్తే, ఆ సినిమాలో చిరంజీవి, శ్రీకాంత్ కూడా కాస్సేపు కనిపిస్తే.. ఆ కిక్కే వేరప్పా.!
Ram Charan Roshan Shankar Dada.. చాంపియన్ కోసం చిరుత.!
రోషన్ మీరోగా తెరకెక్కిన ‘ఛాంపియన్’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రామ్ చరణ్.
‘నాకు మగధీర సినిమా ఎలానో.. నీకు ఛాంపియన్ సినిమా అలా..’ అంటూ, రోషన్ గురించి రామ్ చరణ్ చెప్పడం విశేషం.
చిరంజీవిని శ్రీకాంత్ ‘అన్నయ్యా’ అని పిలిస్తే, శ్రీకాంత్ అన్నయ్యా.. అని రామ్ చరణ్, శ్రీకాంత్ గురించి ప్రస్తావించడం చాలామందిని ఆశ్చర్యపరిచింది.
రామ్ చరణ్ సింప్లిసిటీ, శ్రీకాంత్ మీద రామ్ చరణ్‌కి వున్న అభిమానం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అన్నట్టు రామ్ చరణ్‌ని ‘చిరుత’ సినిమాతో హీరోగా పరిచయం చేసిన అశ్వనీదత్, రోషన్‌తో ‘ఛాంపియన్’ సినిమాని నిర్మించారు.
వైజయంతీ సంస్థ, ఆ సంస్థ నుంచే వచ్చిన స్వప్న సినిమా.. ఈ రెండూ సంయుక్తంగా, చరణ్ – రోషన్ కాంబినేషన్‌లో ‘శంకర్ దాదా’ సినిమాని తెరకెక్కిస్తే అదిరిపోద్ది కదా.!
దర్శకుడిగా ఎవరైతే బావుంటుంది.? అనిల్ రావిపూడి పేరుని ప్రతిపాదిస్తున్నారు నెటిజనం.!
