HBD Salman Khan Wedding.. బాలీవుడ్‌లో ‘ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఇంకెవరు.? సల్మాన్ ఖాన్.! ఆరు పదుల వయసులోకి అడుగు పెట్టేశాడు తాజాగా.!
పలువురు సినీ ప్రముఖులు సల్మాన్ ఖాన్‌కి సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ అందించేశారు. సల్మాన్ ఖాన్ అభిమానులు, తమ అభిమాన నటుడి పుట్టిన రోజు వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.
ఇంతకీ,సల్మాన్ ఖాన్ పెళ్ళెప్పుడు.? ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్. సల్మాన్ ఖాన్ జీవితంలో చాలామంది అందాల భామలున్నారు.
ఒకప్పుడు సల్మాన్ ఖాన్ గర్ల్ ఫ్రెండ్.. అనే ట్యాగ్ తగిలించుకోవడానికి ప్రత్యేకమైన గౌరవంగా కొందరు హీరోయిన్లు పీలయ్యేవారు. ఆ లిస్టు చాంతాడంత వుంటుంది.
కొన్ని స్నేహాల్ని దాదాపుగా పెళ్ళి పీటల వరకూ తీసుకెళ్ళగలిగాడు సల్మాన్ ఖాన్. కానీ, ఏం లాభం.. ఎవరితోనూ సల్మాన్ ఖాన్ పెళ్ళి పీటలెక్కలేకపోయాడు.
తప్పంతా సల్మాన్ ఖాన్ వైపే వుందంటారు చాలామంది. కానీ, కొందరు మాత్రం సల్మాన్ ఖాన్ టైమ్ బ్యాడ్.. అంటారు.! ఇంతకీ, సల్మాన్ ఖాన్ అభిప్రాయమేంటి.?
ఏమో, నా జీవితంలో పెళ్ళికి అవకాశమే లేదమో.. అనే నైరాశ్యం అప్పుడప్పుడూ ప్రదర్శిస్తుంటాడు సల్మాన్ ఖాన్. కానీ, ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటానంటూ, సల్మాన్ ఖాన్ అదే పట్టుదలని ప్రదర్శించడం చూస్తున్నాం.
ఆరు పదుల వయసులో సల్మాన్ ఖాన్‌కి పిల్లనిచ్చేదెవరు.? అన్న ప్రశ్న సహజంగానే తెరపైకొస్తుంటుంది. ఏమో, ఎవరో అందగత్తె నా కోసం ఎదురు చూస్తోందేమో.. అని ముసి ముసి నవ్వులు నవ్వేస్తాడు సల్మాన్ ఖాన్.
నిజానికి, సల్మాన్ ఖాన్‌కి పిల్లలంటే ఇష్టం.! పోనీ, దత్తత తీసుకోవచ్చు కదా..? అంటే, ఆ పరిస్థితి వస్తే, అప్పుడు ఆలోచస్తా.. అని, ఈ మధ్యనే ఓ ఇంటర్వ్యూలో సల్మాన్ ఖాన్ సెలవిచ్చాడు.
ఔను, సల్మాన్ ఖాన్.. అనే ప్రస్తావన వస్తే, ఖచ్చితంగా పెళ్ళి గురించిన చర్చ జరుగుతుంది. పుట్టిన రోజు సందర్భంగా కూడా అదే చర్చ.!
అరవయ్యవ పుట్టిన రోజు మరి.. కొత్త సంవత్సరంలో అయినా, సల్మాన్ ఖాన్ పెళ్ళి పీటలెక్కుతాడా.? ఏమో, ఆ సంగతి పక్కన పెట్టి, సల్మాన్ ఖాన్‌కి బర్త్ డే విషెస్ అందించేద్దాం.
హ్యాపీ బర్త్ డే సల్మాన్ ఖాన్.!
