Sunny Leone Shocker.. ఎక్కడో విదేశాల్లో అడల్ట్ వీడియోలు చేసుకుంటూ, తన పనేదో తానకు చేసుకుపోతున్న సన్నీ లియోన్ని బాలీవుడ్‌కి తీసుకొచ్చారు.
ఈ క్రమంలో ఆమె చాలా అవమానాలు ఎదుర్కొంది. కొందరు నటుల జీవిత భాగస్వాములు, సన్నీలియోన్ మీద గుస్సా అయ్యారు.. ఆమెకి వ్యతిరేకంగా ఆందోళనలూ చేశారు.
తమ భర్తల్ని తమ నుంచి దూరం చేయడానికే సన్నీ లియోన్ని తీసుకొచ్చారంటూ, అప్పట్లో పలువురు ప్రముఖ నటుల ఇళ్ళల్లోని మహిళలు రోడ్డెక్కినంత పన్జేశారు.!
సన్నీ లియోన్‌కి వ్యతిరేకంగా పెద్దయెత్తున ఆందోళనలు జరిగాయి. ఓ దశలో, ముంబైలో సన్నీ లియోన్‌కి వుండేందుకు నివాసం కూడా దొరకలేదు.

ఎలాగోలా కష్టపడి, బాలీవుడ్లో నిలదొక్కకుని, ముంబైలో నివాసం ఏర్పరచుకుంది సన్నీ లియోన్. తన భర్తనీ తీసుకొచ్చింది. ఓ భారతీయ బాలికను దత్తత తీసుకుంది.
మరోపక్క, సరోగసీ మార్గంలో మరో ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు సన్నీలియోన్, ఆమె భర్త.! పలు సేవా కార్యక్రమాలూ చేపట్టారు సన్నీ లియోన్ దంపతులు భారత దేశంలో.
ప్చ్.. మళ్ళీ సన్నీ లియోన్‌కి కష్టమొచ్చింది. మధురైలో, న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ఒకటి, సన్నీ లియోన్‌తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే, చివరి నిమిషంలో సన్నీ లియోన్‌కి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయ్. దాంతో, నిర్వాహకులు సన్నీ లియోన్‌తో కాంట్రాక్టుని రద్దు చేసుకున్నారు.

ఈ మొత్తం వ్యవహారంపై సన్నీ లియోన్ భర్త తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ‘ఇదేం పద్ధతి.? మేం భారత దేశానికి చాలా చేశాం.. చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాం.. మీ మీద ఇంత కుట్ర ఏంటి.?’ అంటూ వాపోయాడు సన్నీ లియోన్ భర్త.
‘మా పొట్ట కొడతారా.? సన్నీ లియోన్ కెరీర్‌ని దెబ్బ కొడతారా.?’ అంటూ సన్నీ లియోన్ భర్త గుస్సా అవుతున్నాడు. ఈ వ్యవహారంపై సన్నీ లియోన్ మాత్రం ఇప్పటిదాకా స్పందించలేదు.
గతంలో కూడా సన్నీ లియోన్‌కి ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయి.
