Happy New Year 2026.. కాల చక్రం గిర్రున తిరిగేసింది.! పాత సంవత్సరానికి వీడ్కోలు పలికేసి, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం.!
నిజానికి, ప్రతి రోజూ కొత్తగానే ప్రారంభమవుతుంది. చీకటి, వెలుగుల ప్రస్తానమిదే కదా.! చీకటి వెంటే వెలుగు, వెలుగు వెంటే చీకటి.! ఇదే జీవిత సత్యం.
కొత్తగా ఏముంటుంది.? క్యాలెండర్‌లో మారే డేట్ తప్ప.!
ఏం, ఎందుకు కొత్తగా వుండదు, రేపటి గురించి ఈ రోజే కష్టపడితే, వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తే.. జీవితమంతా వెలుగులే కదా.!
కష్ట పడితేనే సుఖం.! సుఖానికి అలవాటు పడిపోతే కష్టం.! శరీరంలో, కణాలన్నీ నిత్యం కష్టపడుతూనే వుండాలి. రక్త ప్రసరన కింది నుంచి పైకీ, పై నుంచి కిందకీ జరిగితేనే కదా మనిషి బతికి వున్నట్లు.!
సో, నిన్న నేడు రేపు.. ప్రతి రోజూ కష్టపడాల్సిందే.! ఆ కష్టంలోనే సుఖాన్ని వెతుక్కోవాలి. అదే కదా, జీవిత పరమార్ధం.!
ఏంటీ, పాఠం ఎక్కువైపోయిందా.? సరే, కొత్త సంవత్సరంలోకి వచ్చేశాం. గత ఏడాది చేదు జ్ఞాపకాల్ని మర్చిపోదాం. తీపి గురుతులతో, కొత్త కొత్తగా భవిష్యత్తుకి బాటలు వేసుకుందాం.
కొత్త ఏడాదిలో అందరికీ మంచే జరగాలని కోరుకుందాం.! ఇంకొంచెం ఎక్కువ కష్ట పడదాం.. అనుకున్నది సాధిద్దాం.!
పాత వ్యసనాల్ని మానేయడం మంచిది. ఒకవేళ మానకపోయినా, కొత్త వ్యసనాల జోలికి మాత్రం వెళ్ళకుండా వుందాం.
పాతదైనా, కొత్తదైనా.. వ్యసనం జీవితాన్ని నాశనం చేస్తుంది గనుక.. జర జాగ్రత్త.!
మళ్ళీ ఇంకొక్కసారి గుర్తు చేసుకుందాం.! ప్రతి రోజూ కొత్తగానే మొదలవుతుంది. రాత్రి పడుకునే ముందు, కష్టాల ఏకరువు మామూలే.!
కానీ, పొద్దున్నే లేవగానే.. కొత్తగా జీవితాన్ని ప్రారంభించడం సత్ఫలితాన్నిస్తుంది.! కోటి ఆశలతో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. ప్రతి క్షణాన్నీ ఆస్వాదిద్దాం.
హ్యాపీ న్యూ ఇయర్.! నూతన సంవత్సర శుభాకాంక్షలు.! 2026 సంవత్సరం మనందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆశిస్తూ.. ఆకాంక్షిస్తూ.. మరోమారు హ్యాపీ న్యూ ఇయర్.!
