Amaravati Ys Jagan Conspiracy.. ఒక రాష్ట్ర రాజధాని మీద, ఆ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్న, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్న వైఎస్ జగన్ ఎందుకు పగబట్టేయాలి.?
ఇదొక మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిపోయింది. ఏ నాయకుడికి అయినా, ఓ ప్రాంతం మీద ఎందుకు ద్వేషం వుంటుంది.? వుండకూడదు. కానీ, వుంది.!
అమరావతి మీద, కడుపు రగిలిపోయేంత పగ, ద్వేషాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి వున్నాయి.
ఎందుకు.? అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాని విషయం. అమరావతిన కమ్మరావతి అన్నారు.. ముంపు ప్రాంతమన్నారు.. ఎడారి, స్మశానం.. ఇలా చాలా పేర్లు పెట్టారు.
ఓ వైపు అమరావతి మీద విషం చిమ్ముతూనే, ఇంకో వైపు అదే అమరావతి నుంచి ఐదేళ్ళపాటు, రాష్ట్రాన్ని పరిపాలించేశారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో.
Amaravati Ys Jagan Conspiracy.. రాజధానిపై రాక్షసత్వం..
అదే అమరావతిలో, వైఎస్ జగన్ తన సొంత ప్యాలెస్సుని నిర్మించుకున్నారు. కానీ, ఆ అమరావతి ‘కృష్ణా రివర్ బేసిన్’లో వుంది, అక్కడస్సలు ఎలాంటి భవనాల నిర్మాణాలకూ అనుమతులుండవని సెలవిచ్చారు జగన్.
ఇక, విజయవాడకి నలభై కిలోమీటర్లు, గుంటూరుకి నలభై కిలోమీటర్లు.. అంటూ, వైఎస్ జగన్ ఏవేవో లెక్కలు చెప్పారు తాజాగా.!
విజయవాడ, గుంటూరు.. ఇవి రెండూ భవిష్యత్తులో అమరావతి పరిధిలోకే వస్తాయి. ఆ స్థాయిలో అమరావతి నగరం విస్తరించనుంది. ఇది అర్థం చేసుకోలేనంత అమాయకత్వం జగన్‌లో వుందా.?
పైగా, ముఖ్యమంత్రిగా మూడు రాజధానుల ప్రతిపాదన చేసిన వైఎస్ జగన్, ఆ మూడిటిలో ఒకటిగా అమరావతిని లెజిస్లేటివ్ క్యాపిటల్.. అని పేర్కొన్న విషయం విదితమే.
విజయవాడ కూడా కృష్ణమ్మ చెంతనే..
దేశ రాజధాని ఢిల్లీ సహా, దేశంలో ప్రముఖ నగరాలు చాలావరకు నదీ తీరంలోనే వున్నాయి. చెన్నయ్ నగరం, సముద్ర తీరం. ముంబై నగరం కూడా సముద్ర తీరమే.
కోల్‌కతా నగరం కూడా నదీ తీరాన వుంది. ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి రాజధానిగా వర్ధిల్లిన హైద్రాబాద్ కూడా మూసీ నది ఒడ్డునే నిర్మించబడింది.
అంతెందుకు, విజయవాడ నగరం కూడా, కృష్ణా నదిని ఆనుకునే కదా వున్నది.! మరి, అదే కృష్ణా నదీ తీరాన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి వుంటే తప్పేంటి.?
వైఎస్ జగన్ తీరు చూస్తోంటే, రాజధాని అంటేనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఇష్టం లేదేమో అనిపించకమానదు. అసలు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని వుండకూడన్న కుట్ర సిద్ధాంతాన్ని వైఎస్ జగన్ అమలు చేస్తున్నారేమో.!
