NEET Cockroaches Paid Celebrities.. సినీ నటి అయేషా ఖాన్, కాక్రోచ్ బృందంతో కలిసి ధర్నా కోసం ప్రయత్నిస్తే, పోలీసులు ఆమెని అదుపులోకి తీసుకున్నారు.!
దాంతో, అయేషా ఖాన్ గుస్సా అయ్యింది. ఎడా పెడా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టింది. ‘దురంధర్’ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ చేసింది ఈ అయేషా ఖాన్.
అలా అయేషా ఖాన్‌కి ఆల్రెడీ వున్న పాపులారిటీతో, ఆమె అరెస్టు వ్యవహారం మరింత హాట్ టాపిక్ అయ్యింది.
అయేషా ఖాన్ మాత్రమే కాదు, చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా, తమలోని ‘బొద్దింక’ నైజాన్ని బయటపెట్టుకుంటున్నారు.
నీట్ పరీక్ష లీక్ వివాదం, ఆపై కాక్రోచ్ జనతా పార్టీ హంగామా.. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఢిల్లీ వేదికగా పెద్ద యాగీ జరుగుతోంది. దేశవ్యాప్తంగా వివిధ నాగరాల్లోనూ ఆ యాగీ కొనసాగుతోంది.
Ayesha Khan.. విద్యార్థుల ముసుగులో అసాంఘీక శక్తులు..
నిజమే, విద్యార్థుల ఆవేదన అర్థం చేసుకోదగ్గదే. కానీ, ఆ ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకాలు అస్సలేమాత్రం సమర్థనీయం కాదు.
అయోధ్య రాములోరిపై దూషణలు, ప్రధాని నరేంద్ర మోడీని చంపేస్తామని బెదిరింపులు.. పార్లమెంటుపై దాడి యత్నం.. ఇవన్నీ విద్యార్థులు చేస్తున్నవి కాదు.
విద్యార్థుల ముసుగులో చివరికి హిజ్రాలు కూడా, దాడులకు తెగబడుతున్నాయంటే పరిస్థితి తీవ్రత ఏంటో అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి, ఇలాంటి అరాచకాన్ని ఎవరూ సమర్థించకూడదు.
కానీ, సెలబ్రిటీలు కొందరు.. అందుకుంటున్న పేమెంట్లకు అనుగుణంగా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్నారు ‘బొద్దింకలకి’ మద్దతుగా.
అప్పుడు బెట్టింగ్.. ఇప్పుడు బొద్దింకలు..
అయేషా ఖాన్ కూడా ఆ బాపతు కిందకే వస్తుంది. బెట్టింగ్ యాప్స్ ఇచ్చే డబ్బులకి కక్కుర్తి పడి, జనాల్ని చంపేస్తున్న బెట్టింగ్ యాప్స్‌కి ప్రచారకర్తలుగా మారినోళ్ళు, బొద్దింకల అచారకాలకు మద్దతివ్వడంలో వింతేముంది.?
అయేషా ఖాన్ తెలుగులోనూ కొన్ని సినిమాలు చేసిందనుకోండి.. అది వేరే సంగతి. పలువురు తెలుగు సెలబ్రిటీలు కూడా, సోషల్ మీడియా వేదికగా బొద్దింకల అరాచకాల్ని వెనకేసుకొస్తున్నారు.
దేశం ఏమైపోతేనేం, తమకు డబ్బులొస్తే చాలనుకుంటున్నారేమో ఆయా సెలబ్రిటీలు. ఇది దేశద్రోహం కిందకే వస్తుందన్న విషయాన్ని సదరు సెలబ్రిటీలు మర్చిపోతే ఎలా.?
