Panchayat Vote For Sale.. ఉప ఎన్నికల సమయంలో ఒక్కో ఓటుకీ ఆరు వేల రూపాయల నుంచి పది వేల రూపాయల వరకూ ధర పలకడం గురించి విన్నాం.. చూశాం కూడా.!
కానీ, పంచాయితీ ఎన్నికల్లో ఓటుకి ఇరవై ఒక్క వేల రూపాయల ధర పలకడం ఎప్పుడైనా విన్నామా.? ఎక్కడైనా చూశామా.?
ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ వింత చోటు చేసుకుంది. వార్డు మెంబర్‌గానో, గ్రామ సర్పంచ్‌గానో గెలిస్తే, ఏమొస్తుంది.? లక్షలకు లక్షలు.. కోట్లకు కోట్లు సంపాదించుకునే అవకాశం వుంటుందా.?
ఎంపీగా గెలిస్తే, పండగే పండగ.! జాతీయ స్థాయిలో గుర్తింపు.. బోల్డన్ని వెసులుబాట్లు. ఎమ్మెల్యేగా గెలిస్తే, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు, ఇక్కడా బోల్డన్ని వెసులుబాట్లు.!
Panchayat Vote For Sale.. ఎంత ఖర్చుపెడితే అంత లాభం..
కమిషన్లు, ఇతరత్రా ఆమ్యామ్యాలు.. ఇవన్నీ ఎమ్మెల్యే, ఎంపీ స్థాయి నాయకులకు సర్వసాధారణం. అందుకే, కోట్లు ఖర్చు చేస్తుంటారు ఎన్నికల్లో గెలవడానికి.
అదృష్టం బావుండి మంత్రి పదవులు రాష్ట్రంలోనో, కేంద్రంలోనో దక్కితే.. ఇక, సంపాదనకి తిరుగుండదు. ఇదీ, రాజకీయ వ్యాపారమంటే.!
మరి, పంచాయితీ స్థాయిలో నాయకులకు ఎలాంటి అవకాశాలుంటాయి.. సంపాదన పరంగా.? కొందరికి కొంత మేర వుంటాయ్. కొందరికి, అస్సలు అవకాశమే వుండదు.
ఎంత అవకాశం వున్నా సరే, ఓటుకి 20 వేల పైన ఖర్చు చేయడమంటే, ఆషామాషీ వ్యవహారం కాదు.! రాష్ట్రంలోని పలు చోట్ల ఈ ధర పలుకుతోందంటే, రాజకీయం ఎంత ఖరీదైపోయిందో అర్థం చేసుకోవచ్చు.
ఇజ్జత్ కా సవాల్..
గెలిస్తే, తిరిగి సంపాదించుకోవచ్చన్న ఆలోచనతో కొందరుంటే.. ఇజ్జత్ కా సవాల్.. అన్న కోణంలో ఇంకొందరు అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారు.
ఓటుకి పది వేలు ఖర్చు చేశాననీ, అయినా ఓటర్లు తనను మోసం చేశారనీ, పది పైసల వడ్డీకి పదిలక్షలు తీసుకొచ్చాననీ, ఆ డబ్బులు తనకిచ్చేయాలని ఓడిపోయిన అభ్యర్థి ఆ మధ్య వాపోయాడు.
వైసీపీకి చెందిన నాయకుడతడు. తొలి విడత కార్పొరేషన్లు, మునిసిపాలిటీ ఎన్నికల్లో రాయలసీమ నుంచి పోటీ చేశాడాయన. ఇదీ గ్రౌండ్ రియాల్టీ.
Also Read: శారీ డ్రేపిస్ట్.! ‘అందంగా’ చీర కట్టగలిగితే లక్షల్లో సంపాదన.!
ఎలాగైతేనేం, ఓటర్లు మాత్రం ఆయా ప్రాంతాల్లో పండగ చేసుకుంటున్నారు.. ఎన్నికలంటే, ఓటర్లకు లాభసాటి వ్యాపారం అప్పటికప్పుడు.!
తర్వాత, నాయకుల చేతిలో తాము దోపిడీకి గురవుతామన్న సోయ, ‘అమ్ముడుపోతున్న’ ఓటర్లకు వుండట్లేదనుకోండి.. అది వేరే సంగతి.