Home » బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తోందా.? ఎన్ని రోజులు వుంటుందో.!

బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్తోందా.? ఎన్ని రోజులు వుంటుందో.!

by hellomudra
0 comments
Varshini Sounderajan

Varshini Sounderajan Bigg Boss.. యాంకర్ వర్షిణి తెలుసు కదా.? కొన్ని సినిమాల్లో కూడా నటించింది. హీరోయిన్ పర్సనాలిటీ.. కాకపోతే, టైమ్ బ్యాడ్.. సినిమాల్లో సక్సెస్ కాలేకపోతోంది.

తాజాగా, బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో పదో సీజన్‌కి సంబంధించి కంటెస్టెంట్‌గా వర్షిణి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో పదో సీజన్‌కి షరా మామూలుగానే అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి, వర్షిణి పేరు గత సీజన్ల ప్రారంభానికి ముందు కూడా వినిపించింది. కానీ, ఏ సీజన్‌లోనూ వర్షిణి కనిపించలేదు. ఇప్పుడు ఇంకోసారి వర్షిణి చుట్టూ బిగ్ బాస్ గాసిప్స్ వినిపిస్తున్నాయి.

Varshini Sounderajan
Varshini Sounderajan

ప్రతి సీజన్‌లోనూ బుల్లితెర యాంకర్లను, బుల్లితెర నటీనటుల్ని కంటెస్టెంట్లుగా తీసుకోవడం బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో ఆనవాయితీగా వస్తోంది.

ఈసారి కూడా పలువురు బుల్లితెర నటీనటుల్ని, అందునా కన్నడ నటీనటుల్ని కంటెస్టెంట్లుగా ఎంపిక చేశారు. ఫిమేల్ యాంకర్ కేటగిరీలో వర్షిణిని తీసుకుంటున్నారట.

శ్రీముఖి, విష్ణుప్రియ, అరియానా గ్లోరీ.. ఇలా పలువురు బుల్లితెర యాంకర్లు బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

Varshini Sounderajan
Varshini Sounderajan

ప్రధానంగా గ్లామరే బుల్లితెర యాంకర్లు బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షోలో ప్రదర్శించేది. ఆ కోణంలో చూస్తే, వర్షిణి బోల్డంత గ్లామర్ షో చేయగలదు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక, ఆయా యాంకర్ల పరిస్థితి ఏంటి.? అంటే, అది మళ్ళీ వేరే చర్చ. ఇంతకీ, బిగ్ బాస్ హౌస్‌లో వర్షిణి ఎన్ని రోజులు వుండగలుగుతుంది.?

ముందైతే, వర్షిణి కంటెస్టెంట్ అవునా.? కాదా.? అన్నది తేలాలి. కంటెస్టెంట్ అయితే మాత్రం, ఖచ్చితంగా కొన్ని వారాల పాటు.. అంటే, ఓ ఐదారు వారాలకు పైనే ఆమె హౌస్‌లో కొనసాగే అవకాశముంది.

ఆ కేపబిలిటీ వర్షిణికి వుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group