బిగ్‌బాస్ మూడో సీజన్‌కి సంబంధించి కొత్త కెప్టెన్‌గా అలీ రెజా ఎంపికయ్యాడు. కెప్టెన్సీ కోసం జరిగిన టాస్క్‌లో విజేతగా నిలిచిన అలీ రెజాని కెప్టెన్‌గా బిగ్‌బాస్ ప్రకటించడంతో బిగ్‌హౌస్‌లో సంబరాలు మిన్నంటాయి. అలీ రెజాతో బిగ్‌హౌస్‌లో ఎవరికీ (Sree Mukhi Rahul Sipligunj) పెద్దగా విభేదాల్లేవ్.
కాగా, టాస్క్ సందర్భంగా కొంత ఘర్షణ వాతావరణం చోటు చేసుకున్నా, అందరూ దాన్ని స్పోర్టివ్‌గా తీసుకున్నారు. ఇదిలా వుంటే, కెప్టెన్సీ టాస్క్ ముగిసిన తర్వాత, పంచాయితీ జరిగింది. ఆ పంచాయితీ సందర్భంగా పునర్నవి భూపాలం ఆసక్తికరమైన ప్రతిపాదనల్ని తెరపైకి తెచ్చింది.
వీకెండ్ షో సందర్భంగా మేకప్ వేసుకునే హౌస్‌మేట్స్, టిష్యూస్‌ని చెల్లాచెదురుగా పడేస్తున్నారనీ, ఇకపై అలా చేయకూడదని పునర్నవి కెప్టెన్ దృష్టికి తీసుకొస్తే, కెప్టెన్ అలీ ఆ విషయంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని తీర్మానించి, ఆదేశించాడు.
ఇద్దరు వ్యక్తుల మధ్య సీరియస్ ఇష్యూ జరుగుతున్నప్పుడు మూడో వ్యక్తి అందులోకి ఎంటర్ అవకూడదని అషు రెడ్డి అర్థం పర్థం లేని వాదన తెరపైకి తెస్తే, అలా ఎలా కుదురుతుందంటూ కెప్టెన్ అలీ అసహనం వ్యక్తం చేశాడు. ‘ఇద్దరి మధ్యా వాతావరణం చాలా హీట్ మీద వుంటుంది. ఇంకొకరు వస్తే, ఆ ఇష్యూ కొంత చల్లబడే అవకాశం వుంటుంది’ అని అలీ తేల్చాడు. దాంతో అషు కాస్త నొచ్చుకుంది.
ఇదిలా వుంటే, శ్రీముఖి – రాహుల్ సిప్లిగంజ్ మధ్య మాత్రం కోల్డ్ వార్.. కాదు కాదు, హాట్ వార్ కొనసాగుతూనే వుంది. ఆ వార్‌ని చల్లార్చేందుకు శ్రీముఖితో మాట్లాడాలనుకున్నాడు రాహుల్ సిప్లిగంజ్ (Sree Mukhi Rahul Sipligunj). ఇప్పటిదాకా జరిగిన విషయాలపై తాను క్షమాపణ చెబుతున్నానంటూ రాహుల్, శ్రీముఖి ముందే స్పష్టం చేశాడు. ఇద్దరూ విడిగా కలుసుకున్న సందర్భంలో జరిగిందిది.
‘మనిద్దరం హౌస్‌లోకి రాకముందు నుంచీ మంచి ఫ్రెండ్స్. అనుకోకుండా కొన్ని జరిగాయి. అయితే అవి రాంగ్ వేలో కన్వే అయ్యాయన్నది నా భావం. అయినాగానీ, క్షమాపణ చెబుతున్నాను. నా వల్ల నువ్వు హర్ట్ అయి వుంటే క్షమించు’ అని రాహుల్ చెప్పాడు. కానీ, శ్రీముఖి మాత్రం రాహుల్‌ని క్షమించేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు.
‘పర్సనల్‌గా నేను క్షమించినా, నిన్ను బిగ్‌బాస్‌లో ప్రతి వారం ఎలిమినేషన్‌కి నామినేట్ చేస్తూనే వుంటాను’ అని శ్రీముఖి చెప్పడంతో రాహుల్ హర్ట్ అయ్యాడు. ‘అది నీ ఇష్టం, నీకెలా అనిపిస్తే అలా చెయ్యొచ్చు. నేను క్షమాపణ చెప్పాలనుకున్నాను, హార్ట్ ఫుల్‌గా చెప్పేశాను’ అంటూ రాహుల్ మేటర్‌ని క్లియర్ చేసేందుకు ప్రయత్నించాడు.
ఈ మొత్తం డిస్కషన్‌లో రాహుల్‌కి (Sree Mukhi Rahul Sipligunj) షరామామూలుగానే ఫుల్ మార్క్స్ పడిపోయాయి.. అవీ పాజిటివ్‌గా. శ్రీముఖి మాత్రం ఇంకోసారి నెగెటివ్ మార్కులేయించుకుంది. హౌస్‌లో ఇంకొన్నాళ్ళు వుండక తప్పని పరిస్థితి గనుక.. సింపుల్‌గా క్షమాపణని యాక్సెప్ట్ చేసి, ఆ తర్వాత లైటర్ వీన్‌లో రిలేషన్ మెయిన్‌టెయిన్ చేస్తే సరిపోయేది.
నామినేట్ చెయ్యాలనుకుంటే చేయొచ్చు.. చేస్తానని ముందే చెప్పడం దారుణం. గతంలో కౌశల్ విషయంలో ఇలాగే కుట్రలు పన్నినవాళ్ళంతా ఏమయ్యారో చూశాం. అన్ని సీజన్స్‌నీ ఔపోసన పట్టేసిన శ్రీముఖి ఎందుకిలా బ్యాడ్ అయిపోతోంది.? ఏమో, ఆమెకే తెలియాలి.