ఎవరు ఎవర్ని ఎప్పుడెలా తిట్టుకుంటారో తెలియని పరిస్థితి బిగ్‌హౌస్‌లో (Bigg Boss 3 Punarnavi) కన్పిస్తోంది. చుట్టూ బోల్డన్ని కెమెరాలు తమను గమనిస్తున్నాయనే ‘సోయ’ ఎవరికీ వుండడంలేదు. ‘మాస్క్‌లు’ తీసెయ్యమంటే, ఏకంగా వ్యక్తిగత ద్వేషాలదాకా వెళ్ళిపోతున్నారు కంటెస్టెంట్లు. అక్కడికేదో బిగ్‌హౌస్ (Bigg Boss 3 Telugu) ఆయా వ్యక్తుల సొంతమైపోయినట్లే వుంది వ్యవహారం.
శ్రీముఖి బిగ్ హౌస్ మహారాణిలా బిల్డప్ ఇస్తోంటే, అలీ రెజా ఆ బిగ్‌హౌస్‌కి తానే మహరాజునని ఫీలయిపోతున్నాడు. ఇటు శ్రీముఖి (Sree Mukhi), అటు అలీ రెజా.. (Ali Reza) హౌస్‌లో ఇతర కంటెస్టెంట్స్‌ని మనుషుల్లా కూడా చూడటంలేదంటూ సోషల్ మీడియాలో జనం దుమ్మెత్తిపోస్తున్నారు. మహేష్ విట్టా క్యారెక్టర్ని మేగ్జిమమ్ డ్యామేజీ చెయ్యాలన్నది అలీ రెజా వ్యూహంలా కన్పిస్తోంది.
లేకపోతే, ఆల్రెడీ ‘పుల్ల’ కామెంట్ చేసిన అలీ రెజా, మహేష్‌కి (Mahesh Vitta) క్షమాపణ చెప్పాల్సింది పోయి, ‘నా ఇష్టం.. నేను అంటాను, నువ్వు పడాల్సిందే.. నువ్వు తప్పు చేశావ్..’ అనడమేంటి.? ‘నేను చేసింది కరెక్ట్..’ అంటూ అలీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నాడు. మరోపక్క, ఇలాంటి సందర్భాల్లో పునర్నవి చాలా మెచ్యూర్డ్‌గా వ్యవహరిస్తుంటుంది.
‘మహేష్ కొన్ని విషయాల్లో నిన్ను నువ్వు మార్చుకోవాలి..’ అంటూ అతన్ని ‘సంస్కరించే’ ప్రయత్నం పునర్నవి చేసిందిగానీ, అది బెడిసి కొట్టింది. బాబా భాస్కర్కేమో లాంగ్వేజ్ సమస్య. బిగ్ హౌస్‌లో మహేష్, బాబా భాస్కర్ (Baba Bhaskar) తప్ప ఇంకెవరికీ అర్థం కాడు. నిజానికి గొడవ వచ్చింది అలీ రెజా – బాబా భాస్కర్ల మధ్య. బాబా భాస్కర్ ఆవేదనని మహేష్, అలీ రెజా దృష్టికి తీసుకెళ్ళాలనుకోవడం నేరమైపోయింది.
‘హౌస్‌లో అందరితోనూ కలిసి వుండడానికి ప్రయత్నించు’ అని పునర్నవి (Punarnavi Bhupalam) ఇచ్చిన సలహాన్ని మహేష్ తీసుకుంటే మంచిది. ఒక్కటి మాత్రం నిజం, హౌస్‌లో ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి, రవి కృష్ణ విషయంలో ఏం చేసిందో, మహేష్ విషయంలో అలీ రెజా ఇంచు మించు అలాంటిదే చేస్తున్నాడు.
చిత్రంగా మహేష్‌కి (Mahesh) హౌస్‌లో ఇంకెవరూ సపోర్ట్ ఇవ్వడంలేదు. ఆ స్థాయిలో అలీ, హౌస్‌మేట్స్‌ని తనవైపుకు తిప్పేసుకున్నారు. అలీకి ఇంతలా స్ట్రెంగ్త్ రావడానికి శ్రీముఖి (Sree Mukhi) కూడా ఓ కారణమే.