బిగ్ హౌస్‌లో ‘బిగ్ ఫ్రూట్’గా ఆల్రెడీ పేరు సంపాదించేసుకున్నాడు వరుణ్ సందేశ్. అదే సమయంలో, వితికని మాత్రం మిగతా హౌస్ మేట్స్ ‘బిగ్’ కంటెస్టెంట్‌గా భావిస్తున్నారు. ‘వితిక (Vithika Punarnavi Sree Mukhi) లేకపోతే, హౌస్‌లో వరుణ్ (Vithika Varun) జీరో అయిపోతాడు.. సో, వితకని బయటకు పంపించెయ్యాలి..’ ఇదీ బిగ్ హౌస్‌లో కొందరి ప్లాన్.
మరీ ముఖ్యంగా శ్రీముఖి ప్లాన్ ఇదే. తాజా ఎపిసోడ్లో ఆ విషయం మరోమారు స్పష్టమైపోయింది. ఇటు పునర్నవి, అటు శ్రీముఖి.. ఇద్దరూ వరుణ్ సందేశ్ (Varun Vithika) విషయంలో ‘కూల్’గానే వ్యవహరించారు. బిగ్‌బాస్ కన్ఫెషన్ రూమ్‌లో చూపించిన వీడియోలతో పునర్నవి, శ్రీముఖి గుస్సా అయ్యారు.
‘వరుణ్ నువ్వు నాకు సోదరుడి లాంటోడివి.. వితికతోనే ప్రాబ్లమ్..’ అని పునర్నవి చెప్పింది. వితిక, పునర్నవితో ఎంత క్లోజ్‌గా వుండేందుకు ప్రయత్నిస్తున్నా గత కొద్ది రోజులుగా పునర్నవి మాత్రం వితికని దూరం పెడుతోంది. ఈ వీడియోతో ఇద్దరి మధ్యా గ్యాప్ మరింత పెరిగిపోయిందని అనుకోవచ్చు.
అయితే, ఇది జస్ట్ ఫన్ కోసం చేసిన సీక్రెట్ టాస్క్ అని కూడా భావించొచ్చని వితిక (Vithika Sheru), పునర్నవి (Punarnavi Bhupalam) అభిమానుల్లో కొందరు సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. మరోపక్క, శ్రీముఖి ‘వరుణ్ అలా అంటాడని అనుకోలేదు..’ అని అనేసినా, ఆ తర్వాత శ్రీముఖి కూడా వితికనే టార్గెట్ చేసుకుంది.
హౌస్‌లో పలుమార్లు వితిక – వరుణ్ (Vithika Punarnavi Sree Mukhi) గురించి డిస్కషన్ వస్తే, ఎక్కువమంది వితికను బయటకు పంపించెయ్యడం వైపే మొగ్గు చూపారు. ఈ మొత్తం వ్యవహారానికి మొదటి నుంచి స్కెచ్ వేస్తున్నది శ్రీముఖినే కావడం గమనార్హం. ఇక, సీక్రెట్ వీడియోలు చూశాక.. పునర్నవి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. శ్రీముఖిలో కన్నింగ్ యాంగిల్ ఇంకోసారి స్పష్టమయ్యింది. రవిని టార్గెట్ చేసింది శ్రీముఖి.
హౌస్‌లో జరుగుతున్న విషయాలపై తప్పించుకు తిరగడమేంటి.? అని నిలదీసేసింది. ఇదే విషయాన్ని నాగార్జున (Akkineni Nagarjuna) గత వీకెండ్ ఎపిసోడ్లో చెప్పిన సంగతి గుర్తుండే వుంటుంది. అయినా బిగ్ హౌస్‌లో ‘రచ్చ’ ఏమీ తక్కువవలేదు కదా.. మరి బిగ్‌బాస్ (Bigg Boss 3 Telugu) ఎందుకు ఈ చెత్త టాస్క్ ప్లాన్ చేసినట్లు.? ఈ చెత్త టాస్క్‌తో షో తాలూకు రెప్యుటేషన్ మరింత దారుణంగా పడిపోయిందని అంటున్నారు నెటిజన్లు.
బిగ్‌బాస్ (Bigg Boss Telugu 3) అంటే కుట్రలు కుతంత్రాలకు వేదిక.. అనే భావన కలుగుతోందనీ, ఈ కుట్రలు డైలీ సీరియల్స్‌లో కూడా వుంటున్నాయనీ నెటిజన్లు ఆరోపిస్తున్నారు.