బిగ్ బాస్ తెలుగు మూడో సీజన్ కోసం ‘శివగామి’ రమ్యకృష్ణ స్పెషల్ ఎంట్రీ ఇచ్చింది. అదీ హోస్ట్‌గా. అక్కినేని నాగార్జున, తన పుట్టినరోజు వేడుకల కోసం విదేశాలకు వెళ్ళడంతో.. రమ్యకృష్ణ హౌస్‌మేట్స్‌కి పెద్ద షాకే ఇచ్చింది.. గెస్ట్ హోస్ట్‌గా (Samantha Akkineni Bigg Boss Telugu 4).
నిజానికి, రమ్యకృష్ణ ఎంట్రీ ఆ షోకి అప్పట్లో విపరీతమైన జోష్ ఇచ్చిందన్నది నిర్వివాదాంశం. మరిప్పుడు, అలాంటి మ్యాజిక్ రిపీట్ కాబోతోందా.? ‘వైల్డ్ డాగ్’ సినిమా షూటింగ్ నిమిత్తం హైద్రాబాద్‌కి చాలా దూరంగా వున్న అక్కినేని నాగార్జున, తన ప్లేస్‌లోకి ఇంకెవర్నయినా బిగ్ బాస్ ‘గెస్ట్’ హోస్ట్‌గా పంపిస్తాడా.? అంటే, అవుననే అంటున్నారు చాలామంది.
నిజానికి, గత వీకెండ్ ఎపిసోడ్‌కే ఈ మార్పు జరుగుతుందని అంతా అనుకున్నారు. నాగార్జునకి బదులుగా రోజా ఈ షోని హోస్ట్ చేయబోతోందనే ప్రచారం జరిగింది. అయితే, అదంతా ఫేక్ అని తేలిపోయింది. మళ్ళీ రమ్యకృష్ణ పేరు ప్రచారంలోకి వచ్చింది. అదీ ‘తుస్సు’మంది.
ఇప్పుడిక, సమంత అక్కినేని పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. మరోపక్క, ‘వైల్డ్ డాగ్’ షూటింగ్లో వున్న నాగార్జున, అక్కడే ప్రత్యేకంగా వేసిన సెట్ నుంచి హౌస్‌మేట్స్‌తో కనెక్ట్ అవుతాడనీ, సమంత ఇక్కడే.. హైద్రాబాద్‌లో వుండి, బిగ్‌బాస్‌ని కాస్సేపు హోస్ట్ చేస్తుందనీ ఇంకో ప్రచారమూ జరుగుతుండడం గమనార్హం.
ఒక్కటి మాత్రం నిజం.. బిగ్‌బాస్ అంటేనే బోల్డన్ని సర్ప్రైజ్లు. అయితే, గతంలోలా ఈ సీజన్లో సినిమా ప్రమోషన్స్ బిగ్‌బాస్ స్టేజ్ మీద నుంచి జరగడంలేదు. హౌస్‌లోకి సినీ ప్రముఖులు ఎవరూ గెస్ట్ అప్పీయరెన్స్ కోసం వెళ్ళలేకపోతున్నారు.
అంతా కోవిడ్ మహిమ. ఇలాంటి పరిస్థితుల్లో సమంత అక్కినేని (Samantha Akkineni Bigg Boss Telugu 4) గనుక నాగ్ ప్లేస్‌కి వెళితే, ఆడియన్స్‌కి కూడా కొంచెం కాదు, చాలా చాలా కొత్తగా అనిపిస్తుంది. పైగా, సమంత మంచి మాటకారి కూడా.. అది మరింత అడ్వాంటేజ్ అవుతుంది వీకెండ్ షో సందర్భంగా. ఇంతకీ, ఈ ప్రచారాల్లో నిజమెంత.? వేచి చూడాల్సిందే.