కొత్తగా ఒక్కటయ్యేదేముంది.? తిట్టుకున్నాసరే.. చివరికి మేమంతా ఒక్కటేనంటారు. ఆ ముగ్గురూ ఎవరో కాదు సోహెల్, మోనాల్ గజ్జర్, అఖిల్ సార్థక్. ఈ ముగ్గురిలో మళ్ళీ స్వార్ధపరుడు.. అనాల్సి వస్తే, అఖిల్ పేరు ముందుంటుంది. అఖిల్‌కి సాయపడే లిస్ట్‌లో సోహెల్, మోనాల్ (Akhil Monal Sohel Big Combo) పోటీ పడతారు.
అంతకు ముందు ఈ గ్రూప్‌లో మెహబూబ్ (Mehaboob Dilse) కూడా వుండేవాడు. మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాక, ఈ ముగ్గురూ ఓ గ్రూప్‌గా ఏర్పడి ‘గేమ్’ ఆడుతున్నారు. అబిజీత్‌కి హారిక జస్ట్ ఫ్రెండ్ మాత్రమే. గేమ్ విషయానికొస్తే ఇద్దరూ కలవరు. ఆ ఫ్రెండ్‌షిప్‌ని విడదీయడానికీ బిగ్‌బాస్ (Bigg Boss Telugu 4) వెనుకంజ వేయలేదు.
అరియానా, అవినాష్ (Avinash) కూడా టాస్క్‌కి ముందు, టాస్క్‌కి తర్వాత.. అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. సోలో పెర్ఫామెన్స్‌ని టాస్క్‌ల పరంగా ఇస్తారు. ఆ తర్వాత ఇద్దరూ ఒక్కటవుతారు. ఎవిక్షన్ పాస్ గనుక సోహెల్‌కి వచ్చి వుంటే, ముందూ వెనుకా చూసుకోకుండా అఖిల్‌కి (Akhil Sarthak) ఇచ్చేసేవాడే. అఖిల్ కూడా ‘ఇస్తావా.? ఛస్తావా.?’ అని బెదిరించేటోడే.
కానీ, అరియానా (Ariyana Glory) అలా చేయలేదు.. అవినాష్‌ని ఆ పాస్ వాడేసుకోమంది. అవినాష్ కూడా ఓ దశలో అరియానాకి ఇద్దామనుకున్నాడు. కానీ, ఆమె తనకన్నా స్ట్రాంగ్ ప్లేయర్ అన్న నమ్మకంతోనే ఆ పాస్‌ని వాడుకున్నాడు.
తాజాగా జరిగిన ‘పాల’ టాస్క్‌లో అఖిల్ (Akhil), మోనాల్ (Monal Gajjar), సోహెల్ (Syed Sohel Ryan) కలిసి ఓ గ్రూప్‌గా ఏర్పడి (Akhil Monal Sohel Big Combo) గేమ్ ఆడారు. అరియానా – అవినాష్ మధ్య టాస్క్ సందర్భంగా స్నేహం లేకపోవడంతో, ఇద్దరూ రేస్ టు ఫినాలే గేమ్ నుంచి ఔట్ అయ్యారు. మోనాల్, అఖిల్‌కి త్యాగం చేసి ఔట్ అయ్యింది.
‘నేను ఎఫర్ట్ పెట్టాను..’ అని మోనాల్ (Monal Gajjar)చెప్పిందిగానీ, ఆమె తనకోసం ఎఫర్ట్ పెట్టలేదు. ప్రస్తుతానికి సోహెల్, అబిజీత్, హారిక, అఖిల్.. రేసులో వున్నారు.
ఈ నలుగురిలో ఎవరికి ఆ పాస్ దక్కుతుందోగానీ.. ఒకవేళ ఫైనల్ ఫైట్ సోహెల్, అఖిల్ మధ్య పడితే మాత్రం, నో డౌట్.. అఖిల్ ముందుకెళతాడు.. ఎందుకంటే, సోహెల్ త్యాగం చేసేస్తాడు కాబట్టి. అదే అబిజీత్ (Abijeet), హారిక (Alekhya Harika) మధ్య ఫైట్ పడితే.. అది రసవత్తరంగా మారుతుంది.. ఎందుకంటే, ఇద్దరి మధ్యా రాజీ’డ్రామా’ వుండదు గనుక.