అభిమానులో, దురభిమానులో.. సెలబ్రిటీలు తమ ట్వీట్లకు స్పందించాలంటే, ఒకింత హద్దులు దాటాల్సిందేనన్న అభిప్రాయం చాలామందిలో బలపడిపోయింది. ‘పొగిడితే స్పందించరు, తిడితే అయినా స్పందిస్తారా.?’ అన్న కోణంలో ‘కొండకు వెంట్రుక’ని వేసి లాగుతారు. ఇంకేముంది, అట్నుంచి దిమ్మ తిరిగే రిప్లయ్ (Anasuya Bharadwaj Befetting Reply On Negative Trolling) వచ్చేస్తుంటుంది.
అలా ఒకరికి జరిగితే, పదిమంది అదే బాటలో పయనిస్తారు. అయినా సెలబ్రిటీలు మాత్రం, ఎన్ని తిట్లను భరిస్తారు.? ఎప్పుడో ఒకప్పుడు గట్టిగా రిప్లయ్ ఇచ్చి తీరాలి కదా. సెలబ్రిటీల బాధ సెలబ్రిటీలది. ‘మీరెందుకు స్పందించడం.? వాడి పాపాన వాడే పోతాడు..’ అని చాలామంది నెటిజన్లు, సెలబ్రిటీలకు ఉచిత సలహాలిచ్చేస్తుంటారు.
Also Read: అందం.. అనసూయ.. ఆత్మవిశ్వాసం.!
అసలు విషయానికొస్తే, బుల్లితెర సంచలనం అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), వరుస ట్వీట్లతో ఓ నెటిజన్ మీద విరుచుకుపడింది. అందుక్కారణం, అనసూయని సదరు నెటిజన్ తిట్టకూడని తిట్టు తిట్టేశాడు. దానికి అనసూయ కూడా కొంచెం సెన్సార్ చేసినా, తిట్టకూడని తిట్టే తిట్టేసింది.
మధ్యలో సంస్కారం అడ్డు వచ్చిందంటూ, ఆ తిట్టుని కొంచెం సెన్సార్ చేసింది అనసూయ భరద్వాజ్. కొన్నేళ్ళ క్రితం బుల్లితెరకు సంబంధించిన ఓ ఈవెంట్ సందర్భంగా అనసూయ కళ్ళు తిరిగి పడిపోయింది. ఆనాటి ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ, తాజాగా ఓ నెటిజన్ ఆమె మీద సెటైర్లు వేశాడు. ‘అటెన్షన్ కోసమా ఈ ప్రయత్నం.?’ అంటూ అనసూయని తిట్టేశాడు.
అటెన్షన్ సంపాదించాల్సిన అవసరం తనకు లేదని చెబుతూ, ఆ ఈవెంట్ కోసం 22 గంటల పాటు కష్టపడ్డ వైనం గురించి అనసూయ (Anasuya Bharadwaj Jabardasth) చెప్పుకొచ్చింది.
తెల్లవారు ఝామున 5.30 నిమిషాల వరకూ షూటింగ్ చేస్తూ వుండడం వల్ల తాను అలా కళ్ళు తిరిగి పడిపోవాల్సి వచ్చిందని అనసూయ పేర్కొంది. అనసూయ పేరు (Anasuya Bharadwaj Befetting Reply On Negative Trolling) ఇలా వివాదాల్లోకెక్కడం ఇదే తొలిసారి కాదు.
Also Read: ‘ఖిలాడి’ అనసూయతో జర జాగ్రత్త సుమీ..
అనసూయ (Anasuya Bharadwaj Jabardast) పేరుని ఇలా వివాదాల్లోకి లాగేందుకు నెటిజన్లు ప్రయత్నించని రోజంటూ వుండదు. పలు సందర్భాల్లో అనసూయ (Anasuya Bharadwaj Spicy) ఇలాంటి కంత్రీ నెటిజన్ల మీద పోలీసుల్ని ఆశ్రయించింది కూడా. కానీ, ఏం లాభం.? ఆమెపై నెగెటివ్ ట్రోలింగ్ జరుగుతూనే వుంది.
‘ఇద్దరు పిల్లల తల్లివి.. ఏంటీ వెకిలి వేషాలు..’ అంటూ అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj Naughty) మీద అను నిత్యం ట్రోలింగ్ జరుగుతూనే వుంటుంది.. ఆమె అడపా దడపా అలాంటి చెత్త ట్రోలింగ్‌పై తనదైన స్టయిల్లో సమాధానం ఇస్తూనే వుంటుంది. ఇదొక నిరంతరం కొనసాగే ప్రక్రియలా మారిపోవడం శోచనీయం.