నందమూరి బాలకృష్ణ అఘోరా (Nandamuri Balakrishna Akhanda) పాత్రలో కనిపించనున్నారనగానే, ఆ గెటప్ ఎలా వుంటుంది.? అనే ఉత్కంఠ అతని అభిమానుల్లోనే కాదు, సగటు సినీ అభిమానుల్లోనూ కలగడం సహజమే. పైగా, అది బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా. దాంతో, సహజంగానే అంచనాలు ఆకాశాన్నంటేశాయి.
ఇక, తాజాగా ఈ సినిమా టైటిల్ విడుదలయ్యింది. టైటిల్ మాత్రమే కాదు, టీజర్ కూడా విడుదల చేసేశారు చిత్ర దర్శక నిర్మాతలు. ‘అఖండ’ (Akhanda) అనేది సినిమా టైటిల్. బాలయ్య గెటప్ మాత్రం నిజంగానే అందరికీ షాకిచ్చింది. అఘోరా గెటప్.. అదరగొట్టేశాడు బాలయ్య. బాలయ్య అంటేనే మాస్.. బాలయ్య అంటే ఊర మాస్.!
‘కాలు దువ్వే నంది ముందు.. రంగు మార్చిన పంది.. కారు కూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది..’ అంటూ బాలయ్య ‘అఖండ’ టీజర్‌లో చెప్పిన డైలాగ్ (Nandamuri Balakrishna Akhanda) సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. బాలయ్యతో బోయపాటి గతంలో ‘సింహా’, ‘లెజెండ్’ చిత్రాలు తెరకెక్కించిన విషయం విదితమే.
ముచ్చటగా మూడో సారి బాలయ్య (Nandamuri Balakrishna) – బోయపాటి (Boyapati Srinu) జతకట్టారు ‘అఖండ’ కోసం. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఈ సినిమాలో బాలయ్య సరసన నటిస్తోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ ‘అఖండ’ సినిమాని నిర్మిస్తున్నారు.