ప్రతిసారీ అంతకు మించిన గొప్ప పాత్రలు వస్తాయా.? అంటే, అలాంటి పాత్రల కోసమే ఎదురుచూసేవారికి ఖచ్చితంగా వస్తాయని ఆశించొచ్చు. ‘రంగస్థలం’ సినిమాలోని రంగమ్మత్తను మించిన పాత్ర అనసూయకి (Anasuya Bharadwaj Pushpa Rangasthalam Rangammatha) మళ్ళీ దొరుకుతుందా.? అన్న ప్రశ్నకు ‘పుష్ప’ సినిమా ఓ సమాధానం కాబోతోందేమో.!
బుల్లితెర సంచలనం అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj), వెండితెరపైనా అవకాశాల్ని అందిపుచ్చుకోవడంలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. తెలుగు సినిమాల్లోనే కాదు, తమిళ సినిమాల్లోనూ నటిస్తూ తన ఇమేజ్, పాపులారిటీ పెంచుకుంటూ పోతోంది.
తాజాగా ‘పుష్ప’ (Pushpa Sukumar) సినిమాలో నటిస్తున్నానంటూ, ఆ సినిమా షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫొటో విడుదల చేసింది. అయితే, ఆ ఫొటోలో అనసూయ కన్పించట్లేదనుకోండి.. అది వేరే సంగతి.
మాజీ హీరోయిన్ రాశి వదులుకున్న పాత్ర రంగమ్మత్త.. (Anasuya As Rangammatha In Rangasthalam) అది లక్కీగా అనసూయని వరించింది. సుకుమార్ ఆ సినిమాలో అనసూయని చూపించిన తీరు, అనసూయ ఆ పాత్రలో ఒదిగిపోయిన తీరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప’ (Pushpa Allu Arjun Rashmika Mandanna) సినిమాలో అనసూయ పాత్ర ఏంటన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే, సుకుమార్ అనసూయని ‘రంగమ్మత్త’ కంటే గొప్ప పాత్రలో చూపించబోతున్నాడన్న చర్చ జరుగుతోంది.
మరి, ఆ స్థాయి అంచనాలు అనసూయ పాత్ర మీద (Anasuya Bharadwaj Pushpa Rangasthalam Rangammatha) పెట్టుకోవచ్చా.? ఏమో మరి, వేచి చూడాల్సిందే.
అల్లు అర్జున్ (Stylish Icon Staar Allu Arjun) సరసన రష్మిక మండన్న (Rashmika Mandanna) ‘పుష్ప’ (Pushpa Allu Arjun Pushpa Raj) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే.