‘సీటీ మార్’ (Seetimaar Allu Arjun DJ Vs Salman Khan Radhe) అంటూ తెలుగులో స్టైలిష్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్దే (Pooja Hegde)‘డిజె – దువ్వాడ జగన్నాథం’ సినిమా కోసం మాంఛి మాస్ సాంగ్ చేసిన విషయం విదితమే.
హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందింది ‘డిజె’ సినిమా. థియేటర్లలో కంటే, ‘డిజె – దువ్వాడ జగన్నాథం’, యూ ట్యూబ్ అలాగే ఇతర భాషల్లో ఎక్కువగా ప్రేక్షకుల మన్ననల్ని అందుకుందనుకోండి.. అది వేరే సంగతి.
ఇక, ‘సీటీమార్’ సాంగ్ విషయానికొస్తే, అదిప్పుడు బాలీవుడ్ తెరపై కన్పించబోతోంది. సల్మాన్ ఖాన్ (Salman Khan) హీరోగా తెరకెక్కిన ‘రాధే’ సినిమా కోసం ఈ పాటని వాడేశారు. చిన్న చిన్న మార్పులతో సాంగ్ బయటకు వచ్చింది. సల్మాన్ ఖాన్, దిశా పటానీ (Disha Patani) ఈ పాటలో మెరిశారు. మన టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ ఈ పాటకు డాన్స్ సమకూర్చడం గమనార్హం.
సల్మాన్ ఖాన్ మాస్ ఫాలోయింగ్ ఈ పాటని మరో మెట్టు పైకెక్కిస్తుందన్నది నిర్వివాదాంశం. దిశా పటానీ డాన్సుల్లో దిట్ట. అయినాగానీ, డాన్సుల పరంగా చూసుకుంటే, అల్లు అర్జున్ – పూజా హెగ్దే జంటని బీట్ చేయలేకపోయింది సల్మాన్ ఖాన్ – దిశా పటానీ జోడీ.
ఇదిలా వుంటే, సల్మాన్ ఖాన్.. అల్లు అర్జున్ డాన్సుల్ని ప్రశంసిస్తూ ట్వీటేశాడు. దానికి అల్లు అర్జున్ నుంచి హార్ట్ టచింగ్ స్పందన వచ్చింది. ఓ బాలీవుడ్ నటుడు, మన టాలీవుడ్ హీరోని అభినందించడం గొప్ప విషయమే కదా. గతంలోనూ పలు సందర్భాల్లో టాలీవుడ్ నటుల్ని బాలీవుడ్ నటులు పొగడటం చూశాం. అయినా సరే.. అది ఎప్పటికప్పుడు అద్భుతంగానే అనిపిస్తుంటుంది.
సో, ‘సీటీమార్’ సాంగ్ వరకు ఎవరు గొప్ప.? అన్న విషయాన్ని పక్కన పెట్టి, తెలుగు సీటీ మార్.. (Seetimaar Allu Arjun DJ Vs Salman Khan Radhe) అలాగే హిందీ సీటీ మార్ మేనియాలో ఊగిపోవాల్సిందే సంగీత ప్రియులు, డాన్సుల ప్రియులు.. మొత్తంగా సినీ ప్రియులూ.