త్వరలో.. అతి త్వరలో.. అంటూ ఊరించేస్తోంది బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో సీజన్ 5 (Bigg Boss Telugu 5 Contestants & Prize Money). ఇంతకీ, ఐదో సీజన్ ఎలా వుండబోతోంది.? నాగార్జున మరోమారు ‘హోస్ట్’గా కొనసాగుతాడా.? ఈసారి కొత్త హోస్ట్ రాబోతున్నాడా.? కంటెస్టెంట్స్ ఎవరెవరు.? ఇలా రకరకాల ఊహాగానాలు కొద్ది నెలలుగా వినిపిస్తున్నాయి.
అక్కనేని నాగార్జున (King Akkineni Nagarjuna) మరో మారు ఐదో సీజన్ కోసం ‘హోస్ట్’గా కనిపించబోతున్నాడన్నది మెజార్టీ చెబుతున్నమాట. అయితే, ఈసారి మార్పు కోరుతున్న బిగ్ బాస్ (Bigg Boss Telugu 5) నిర్వాహకులు, దగ్గుబాటి రానా పేరుని ‘హోస్ట్’ కోసం పరిశీలిస్తున్నారన్నది మరికొన్ని గాసిప్స్ సారాంశం.
Also Read: సినిమా రివ్యూ.. ఉప్పెన
కంటెస్టెంట్స్ విషయానికొస్తే.. ఈసారి కనీ వినీ ఎరుగని రీతిలో ‘తళుకులు’ వుండబోతున్నాయన్నది అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే, గ్లామర్ డోస్ చాలా ఎక్కువగా వుండబోతోందని. ఫిమేల్ కంటెస్టెంట్స్ ఎవరు.? అన్నదానికి రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి. మేల్ కంటెస్టెంట్స్ విషయంలోనూ రోజుకో కొత్త ఊహాగానం తెరపైకొస్తోంది.
సరే, కంటెస్టెంట్స్ ఎవరన్నది చివరి నిమిషం వరకూ రహస్యంగానే వుంటుంది. ఈలోగా లీకులొస్తుంటాయి.. వాటిల్లో కొన్ని నిజాలు, కొన్ని ఉత్త పుకార్లు వుండడం మామూలే. అయితే, గతంలోలా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.? అన్న ప్రశ్నకు సమాధానం దొరకడం ఈసారి అంత తేలిక కాదట. దానికోసం అత్యంత పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారట.
Also Read: శ్రద్ధ , సమంత బాటలో అలయా ‘యూ టర్న్’
మరోపక్క, ఐదో సీజన్ విన్నర్ అందుకోబోయే పారితోషికం కూడా రికార్డు స్థాయిలో వుండబోతోందని అంటున్నారు. ఆ ప్రైజ్ మనీ ఎంత.? అన్నది జనానికి అనవసరం. బిగ్ బాస్ ఐదో సీజన్ ఏమాత్రం వినోదం విషయంలో తగ్గకూడదన్నదే బుల్లితెర వీక్షకులు, బిగ్ బాస్ (Bigg Boss Telugu 5 Contestants & Prize Money) అభిమానులూ కోరుకునేది. చూద్దాం.. కొత్త సీజన్ ఎలా వుండబోతోందో.!