మామూలుగా ఓ ద్రాక్ష పండు ఖరీదెంత ఉంటుంది.? ఇదేం ప్రశ్న.? కిలోల లెక్కన విక్రయించే ద్రాక్ష పండ్ల విషయంలో ఒక్కో పండుకీ రేటు ఎలా కట్టగలం.? కానీ, అక్కడి ద్రాక్ష పండ్లకూ ఒక్కో దానికీ రేటు కట్టాల్సిందే. ఎందుకంటే అది జపనీస్ ద్రాక్షపండు (Costliest Japanese Grapes) మరి.
ఏ పండు అయినా జపాన్‌లో సమ్‌థింగ్ స్పెషల్. ఎందుకంటే అక్కడ పండుకు అదనపు గ్లామర్ అద్దుతారు. అదొక కళ. ప్రత్యేకతను సంతరించుకునే పండ్లకు రేటు కూడా బహు బాగుంటుంది మరి. వందల్లో కాదు, వేలల్లో, ఒక్కోసారి లక్షల్లో కూడా ధర పలుకుతుంది.
రూటు మార్చిన వాటర్ మెలన్ (పుచ్చకాయ్)
వాటర్ మెలన్.. అదేనండీ మన పుచ్చకాయ్. జపాన్‌లో మాత్రం వేరే టైపులో దొరుకుతుంది. చాలా వరకూ గుండ్రంగానే దొరుకుతాయ్ పుచ్చకాయలు (Japanese Water Melon). కొన్ని అండాకారంలోనూ ఉంటాయి. కానీ, జపాన్‌లో మాత్రం చతురశ్రాకారంలో దొరుకుతాయ్. దీర్ఘ చతురస్రాకారంలోనూ దొరుకుతాయ్. లవ్ సింబల్ ఆకారంలోనూ లభ్యమవుతాయ్. ఆ మాటకొస్తే, ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తారు జపాన్ రైతులు.

ఓ ప్రేమికుడు తన ప్రియురాలికి, పుచ్చకాయ్ ఇచ్చి లవ్ ప్రపోజ్ చేస్తాడు. దానికి తగ్గట్టుగా పుచ్చకాయ్ని డిజైన్ చేయించుకుంటాడు. అందుకే దానికంత స్పెషల్. రేటు కూడా అందుకే ఎక్కువగా ఉంటుంది. పుచ్చకాయ్ కోసి చూస్తే అందులో హార్ట్ సింబల్ కనిపిస్తుంది. అఫ్ కోర్స్ కాయ కూడా దాదాపు అలాగే కనిపిస్తుంది.
Japanese Grapes ద్రాక్ష పండు.. రేటు దిమ్మ తిరిగిపోద్ది
ఒక్క ద్రాక్ష పండు కోసం వేలు ఖర్చు చేయాల్సి వస్తే, అది జపనీస్ ద్రాక్ష పండు అవుతుంది. ఏంటి దానికి ఆ ప్రత్యేకత అంటే, సాధారణ ద్రాక్ష పండు కంటే, పెద్దగా కనిపిస్తుంది. ఓస్ అంతేనా.! అనుకుంటున్నారా.? అంతేకాదు, చాలా వుంది. రుచిలో ఘనం. పోషకాల్లోనూ ఘనం. ఏడాదిలో ఒక్కసారి మాత్రమే కాపుకొస్తుందది. అదీ చాలా తక్కువగా. పంటకి చాలా చాకిరీ చేయాలి. పురుగుల మందులేమీ వాడరు.
Also Read: అయితే పగిలిపోవాలి.. లేదంటే షాకవ్వాలి.!
ఇంకో ప్రత్యేకత ఏంటంటే, ఒక్కో గుత్తుకీ దాదాపు ఒకే సంఖ్యలో ద్రాక్ష పండ్లు కాస్తాయి. అన్నీ ఒకే రంగులో ఉంటాయి. ఒకే రుచితో ఉంటాయి. ఆ రంగు కూడా చాలా ప్రత్యేకమైనదే. అందుకే ఆ ద్రాక్షకు అంత రేటు.
ప్రత్యేకత పండులో ఉందా.? లేదంటే, తెగ బలిసి ఆ పండుకి కొందరు అంత ప్రత్యేకతను ఆపాదిస్తున్నారా.? ఎవరన్నా ఏమన్నా అనుకోండి. జపాన్ రూటే సెపరేటు. అక్కడి పండ్లకు ఆయా సందర్భాల్లో వచ్చే క్రేజ్‌ను బట్టి రేటు పలుకుతుంటుంది.
పండ్లు మాత్రమే కాదు, ఘాటైన మిర్చి సహా చాలా రకాల ఉత్పత్తులకు తమదైన ప్రత్యేకతలు ఆపాదించి, జన్యు మార్పిడిలు చేసి, వాటి కోసం విదేశీయులు సైతం చొంగ కార్చుతూ వచ్చేలా చేయగలగడం జపాన్ (Costliest Japanese Grapes) ప్రజల ప్రత్యేకత.
Also Read: రాఫెల్.. మనకెందుకంత ప్రత్యేకం.?