Sai Pallavi Dance.. నాని డ్యూయల్ రోల్ పోషిస్తున్న సినిమా ‘శ్యామ్ సింగరాయ్’. బెంగాలీ బ్యాక్ డ్రాప్లో ఈ సినిమా రూపొందబోతోందని ఇంతవరకూ రిలీలైన ప్రచార చిత్రాల ద్వారా అర్ధమైపోయింది. ఇక, ఇప్పుడు సినిమా ట్రైలర్ రిలీజైంది.
ట్రైలర్ విషయానికి వస్తే, రెండు ఫ్రేముల్లో ట్రైలర్ కట్ చేశారు. ఒక ఫ్రేమ్ 70లలో నడుస్తుంది. ఇంకో ఫ్రేమ్ 90 లలో నడిస్తుంది. 70లలో నడిచే ఫ్రేమ్‌లో నానికి జోడీగా సాయి పల్లవి నటించింది. దేవదాసి పాత్రలో సాయి పల్లవి అప్పియరెన్స్, హావభావాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయ్.
నాని షాక్‌కి గురయ్యేలా Sai Pallavi Dance..

ప్రేక్షకుల్నే కాదు, హీరో నానిని సైతం సాయి పల్లవి (Sai Pallavi) తన నటనతో షాక్‌కి గురి చేసిందట. దేవదాసి పాత్రలో సాయి పల్లవి చేసిన డాన్స్ అద్భుతహ అన్నాడు నాని. ఆ డాన్సులో సాయి పల్లవిని చూసి.. ‘నాకు నటించాల్సిన అవసరం రాలేదు..’ అని నాని (Natural Star Nani) సాయి పల్లవి గురించి చెప్పడం విశేషం.
ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ చాలా బాగుందని సాయి పల్లవి చాలా చాలా స్పెషల్‌గా చెప్పింది. అంతేకాదు, కాస్ట్యూమ్స్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.
శ్యామ్ సింగరాయ్.. అంతకు మించి..
కేవలం లీడ్ రోల్స్ కాస్ట్యూమ్సే కాదు, జూనియర్ ఆర్టిస్టుల కాస్ట్యూమ్స్ గురించి కూడా సాయి పల్లవి (Sai Pallavi) ప్రత్యేకంగా మాట్లాడింది. అంత అందంగా ఈ సినిమాలో కాస్ట్యూమ్ డిజైన్స్ అదిరిపోయాయట.
Also Read: యుద్ధాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆయుధాలివీ.!
సెకండ్ ఫ్రేమ్.. అదే, 90లలో స్టోరీ విషయానికి వస్తే, ఈ ట్రాక్‌లో అందాల భామ కృతిశెట్టి (Krithi Shetty), నాని (Natural Star Nani)తో జత కట్టింది. మోడ్రన్ లుక్స్‌లో బేబమ్మ స్సెషల్‌గా ఎట్రాక్ట్ చేసిది. అలాగే, సినిమాలో బేబమ్మ స్మోకింగ్ సీన్స్ నెట్టింట తెగ వైరల్ అయిపోయాయ్ కూడా.
