Radhe Shyam RRR OTT Release.. సినిమా తెరకెక్కించడం అంటే, నిర్మాత పురిటి నొప్పులు పడాల్సిందే. ఒక్కసారి కాదు, కాంబినేషన్ సెట్ అయిన దగ్గర్నుంచి, బొమ్మ ధియేటర్లలో పడేదాకా.. ప్రతిరోజూ, ప్రతి క్షణం పురిటి నొప్పులే. ఏం ఖర్మరా బాబూ ఇది.! అని ఏ నిర్మాతా అనుకోడు. ఎందుకంటే సినిమా నిర్మాణం ఓ ప్యాషన్.
తమ అభిమాన హీరో నటించిన సినిమా ధియేటర్లలో ఎప్పుడెప్పుడు చూస్తామా.? అని అభిమానులు ఎదురు చూడడంలో తప్పు లేదు. అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కాకపోతే అభిమానులు గుస్సా అవుతారు. వారి బాధా అర్ధం చేసుకోదగ్గదే.
సినిమా వర్సెస్ సోషల్ వేధింపులు.!
కానీ, సినిమా మొదలైన దగ్గర్నుంచి, విడుదలయ్యేదాకా నిర్మాతని అప్డేట్స్ కోసం సోషల్ మీడియాలో వేధిస్తూ పోతే ఎలా.? చిన్నసినిమా.. పెద్ద సినిమా అన్న తేడాల్లేవ్. ఆ హీరో, ఈ హీరో అన్న తేడాల్లేవ్. నిర్మాతల్ని, అభిమానుల ముసుగులో కొందరు అత్యంత దారుణంగా వేధించేస్తున్నారు సోషల్ మీడియా వేదికలో.
కోవిడ్ కారణంగా ‘రాధే శ్యామ్’ (Radhe Shyam), ‘ఆర్ ఆర్ ఆర్’ (RRR Movie) సినిమాలు వాయిదా పడ్డాయ్. ఈ రెండింటి మీదా అభిమానులు పెట్టుకున్న ఆశలు.. అన్నీ ఇన్నీ కావు. మరి, ఆ సినిమాల్లో నటించిన నటీనటులకీ, సినిమా కోసం పని చేసిన ఇతర సిబ్బందికీ నిర్మాతకీ ఎలా వుంటుంది.? వాళ్ల బాధ వర్ణనాతీతం.
Radhe Shyam RRR OTT Release.. బొమ్మ థియేటర్లలో పడాలా.? ఇంట్లోనే పడాలా.?
బొమ్మధియేటర్లలో పడితే, ప్రేక్షకులు వస్తారో.. రారో.. తెలీదు. పెట్టిన సొమ్ము రికవరీ అవ్వకపోతే ఏం చేయాలో తెలీదు. సవాలక్ష పాట్లు. ఇది నిర్మాతల యాంగిల్. ‘ఓటీటీలో బొమ్మ పడేయొచ్చుగా..’ అంటూ సోషల్ మీడియాలో వుచిత సలహాలు పోస్ట్ అయిపోతున్నాయ్. ట్వీట్లు వుచితంగానే పడిపోతాయ్. కానీ, సినిమా కోసం కోట్లు ఖర్చవుతాయ్.
Also Read: సీతాకోక చిలుక ‘ముద్దు’: ఇది మీకు తెలుసా.?
పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా టెన్షన్ మాత్రం తప్పదు. అయితే, ఆ టెన్షన్ ‘స్థాయి’లో తేడా వుంటుందంతే. కానీ, గతి లేని పరిస్థితుల్లో ఓటీటీ వైపు చూడాల్సి వస్తే, అప్పుడు నిర్మాతలు సముచిత నిర్ణయం తీసుకుంటారేమో. ఈ లోగా ఈ ‘సోషల్ లొల్లి’ జస్ట్ వేస్ట్.!