Table of Contents
Prabhas And The Big Problem: అసలేమయ్యింది ప్రభాస్‌కి.? పాన్ ఇండియా సూపర్ స్టార్.. అనే ఇమేజ్ సొంతం చేసుకున్నాడుగానీ, సినిమా సినిమాకీ మధ్య గ్యాప్ చాలా చాలా ఎక్కువైపోతోంది. ఎందుకిలా.?
ఎప్పుడు ‘బాహుబలి’.? ఎప్పుడు ‘సాహో’.? ఎప్పుడు ‘రాధేశ్యామ్’.! తర్వాత మళ్ళీ ఎప్పుడు.? ఇలా చాలా ప్రశ్నలే ప్రభాస్ అభిమానుల మెదళ్ళను తొలిచేస్తున్నాయి.
నాలుగైదేళ్ళకు ఓ సినిమా చేసినాసరే, కొడితే బాక్సాఫీస్ బద్దలైపోయేలా కొడతాడు.. అన్న అభిప్రాయమైతే ప్రభాస్‌ని అభిమానించేవారిలోనే కాదు, సగటు సినీ ప్రేక్షకుల్లోనూ వుంది. ‘సాహో’ సినిమాకి వచ్చిన టాక్‌తో సంబంధం లేకుండా, ఆ సినిమా హిందీ వెర్షన్ బాగా వసూళ్ళను సాధించింది.
Prabhas And The Big Problem.. అదే పెద్ద సమస్య.!
ఈ విషయాన్ని ప్రభాస్ పదే పదే ఇంటర్వ్యూల్లో చెబుతూనే వున్నాడు. అయితే, ప్రభాస్ కూడా వేగంగా సినిమాలు చేయాలని, ఏడాదికి రెండు మూడు సినిమాల్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనీ అనుకుంటున్నాడు. ఇదే విషయాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.

రాధేశ్యామ్ తర్వాత ‘ఆదిపురుష్’ (Adipurush), ‘సలార్’ (Salaar), ‘ప్రాజెక్టు కె (Project K)’ తదితర సినిమాలున్నాయి ప్రభాస్ నుంచి రావాల్సినవి. అయితే, వచ్చే ఏడాది వీటిల్లో ఏదన్నా సినిమా వచ్చే అవకాశముందా.? అంటే, ఖచ్చితంగా వస్తుందని చెప్పలేని పరిస్థితి.
ఇలాగైతే ఎలా.?
‘కథల కొరత వుంది.. కమర్షియల్ యాంగిల్‌లో ఆలోచించకపోతే నిర్మాతలు ఇబ్బంది పడతారు. లవ్ స్టోరీస్ చెయ్యాలని నాకూ వుంది.. కానీ, చూస్తున్నారుగా.. ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే వుండాలని అంతా ఆశిస్తున్నారు.. నాకే కాదు, చాలామంది స్టార్ హీరోలది ఇదే పరిస్థితి..’ అని చెప్పాడు ప్రభాస్ తాజాగా.
Also Read: Samyuktha Menon.. ‘పవర్’ అన్‌లిమిటెడ్.!
నిజానికి, ప్రభాస్ ‘బాహుబలి’ (Baahubali) తర్వాత చిన్న సినిమానే చేయాలనుకున్నాడు.. అది కాస్తా ‘సాహో’ (Saaho) అయిపోయింది. ఆ తర్వాత ‘రాధేశ్యామ్’ పరిస్థితి కూడా అంతే. సో, ప్రభాస్ నుంచి ఏడాదికి ఓ సినిమా రావడమంటేనే అదో అద్భుతమైపోయింది.
మళ్ళీ రాజమౌళితోనా.?
అన్నట్టు ప్రభాస్ (Prabhas) మళ్ళీ రాజమౌళితో (Rajamouli) సినిమా చేయబోతున్నాడట. ఓ వైపు ఆనందం, ఇంకో వైపు ఆందోళన.. ఇదీ ప్రభాస్ అభిమానుల పరిస్థితి.
ఎందుకంటే, రాజమౌళి మళ్ళీ తమ అభిమాన హీరోని మూడేళ్ళో నాలుగేళ్ళో.. అంతకన్నా ఎక్కువో లాక్ చేసేస్తే ఎలా.? అన్నది వారి ఆవేదన.
ఏదిఏమైనా ప్రభాస్ తన అభిమానుల కోసమైనా, కాస్త కష్టపడి కొత్త కథల కోసం ప్రయత్నించి.. ఏడాదికి ఓ సినిమా చేస్తే.. అంతకన్నా కావాల్సిందేముంది.?