Radhe Shyam First Report: హస్త సాముద్రికం గురించి అందరికీ తెలిసిందే. చేతిలోని రేఖల్ని చూసి భవిష్యత్తు ఎలా వుండబోతోందో చెప్పేదే హస్త సాముద్రికం. జ్యోతిష శాస్త్రంలో హస్త సాముద్రికానికి ప్రత్యేకమైన స్థానం వుంది.
సాధారణంగా సినిమాల్లో కామెడీ కోసమో, ఇంకో కోణంలోనో ఈ హస్త సాముద్రికం అనే కాన్సెప్టుని చాలా తక్కువగా తెలుగు సినిమాల్లో వాడుతుంటారు. అలాంటిది సినిమా హీరో హస్త సాముద్రికుడిగా నటిస్తే.! దటీజ్ ‘రాధేశ్యామ్’.!
‘రాధేశ్యామ్’ థియేటర్ల దగ్గర పండగ ముందే మొదలైపోయింది. ఎక్కడ ప్రీమియర్ షోలు పడతాయోనని అభిమానులు ఊరూ వాడా షికార్లు చేసేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. అన్న తేడాల్లేవిక్కడ.! అంతేనా, పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి.
చెన్నయ్, ముంబై, బెంగళూరు.. అన్ని చోట్లా ‘రాధేశ్యామ్’ థియేటర్ల వద్ద దాదాపు ఒకటే హంగామా.! ఒకదాన్ని మించిన హంగామా ఇంకోటి.! మన దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా ‘రాధేశ్యామ్’ హంగామా కనీ వినీ ఎరుగని స్థాయిలో కనిపిస్తోంది.!
Radhe Shyam First Report.. కోవిడ్ కష్టాల్ని దాటుకుని..
ప్రభాస్ (Prabhas) హీరోగా నటించిన ‘రాధేశ్యామ్’ (Radhe Shyam) సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఎట్టకేలకు.. అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, సినిమాకి అద్దిన భారీతనం వల్ల మాత్రమే కాకుండా, కోవిడ్ పాండమిక్ కారణంగా వచ్చిన లాక్ డౌన్ వల్ల ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంది మరి.
‘జిల్’ ఫేం రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో యువీ సంస్థ నిర్మించిన ‘రాధేశ్యామ్’ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్గా నటించింది. సీనియర్ నటుడు కృష్ణంరాజు ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తారు. ఇంతకీ ‘రాధేశ్యామ్’ సినిమా కథా కమామిషు ఏంటి.?
Also Read: పూజా హెగ్దే సోయగం.. కలర్ ఫుల్లూ.. ‘బ్యూటీ’ ఫుల్లూ.!
ఫస్ట్ డే ఫస్ట్ షో కంటే ముందే, ప్రీమియర్స్ చూసేసినవాళ్ళ నుంచి వస్తోన్న టాక్ ఎలా వుంది.? ‘రాధేశ్యామ్’ గురించిన పూర్తి వివరాలు.. ఇక్కడే లభిస్తాయ్.! ఈ స్పేస్‌ని ఫాలో అవుతూనే వుండండి.!
బొమ్మ పడింది.. మెగాస్టార్ చిరంజీవికీ.. జక్కన్న రాజమౌళికీ కృతజ్ఞతలతో మొదలైంది..
మొదలవుతూనే గ్రాండియర్ కనిపిస్తోంది.. సినిమా ఫ్లాష్ బ్యాక్ షురూ అయ్యింది..
ప్రభాస్ స్టైలింగ్.. సినిమాటోగ్రఫీ.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టాప్ క్లాస్..
Also Read: సమంత అందాల దాడి.! ఊ అంటారా.. ‘నో’ అనగలరా.!
సంచారి సాంగ్ విజువల్స్.. అంచనాలకు మించి.!
ఫస్టాఫ్ రిపోర్ట్: ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్, విజువల్స్, మ్యూజిక్.. ప్రభాస్ స్టైలింగ్.. పూజా హెగ్దే స్టైలిష్ లుక్.. ఇవీ హైలైట్స్..
ఫస్టాఫ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇదొక అందమైన దృశ్యకావ్యం.!
ఫస్టాఫ్‌తో పోల్చితే సెకెండాఫ్ ఒకింత పేస్ ఎక్కువగానే అనిపిస్తుంది. ఆ గ్రాండియర్ లుక్‌లో ప్రతి సన్నివేశమూ అంతకు మించి.. అనేలానే వుంది. తెలుగు తెరపై ఇదొక సాంకేతిక అద్భుతం అనొచ్చు.
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోని మాస్ ఎలిమెంట్స్ మాత్రం ఇందులో పెద్దగా కనిపించవ్.! ఓవరాల్‌గా ఈ సినిమాని ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చెయ్యాల్సిందే.!