Kriti Sanon Shines Like Peacock: వయ్యారంలో మయూరంతో పోటీపడగలరా.? ఎవరైనా. నేను పోటీ పడతానంటోంది సొగసరి కృతిసనన్. ఎలా అంటారా.? మీరే చూడండి. లైట్ పర్పుల్ కలర్ లాంగ్ ఫ్రాక్ ధరించి అచ్చు మయూరాన్ని తలపిస్తోంది అందమైన కృతిసనన్.
ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ కల్లోలం రేపుతున్నాయ్. అచ్చంగా అందమైన మయూరమే వచ్చి అలా కూర్చుందా.? అన్నట్లుగా వుందీ పిక్స్‌లో కృతిసనన్ (Kriti Sanon) పోజు.
Kriti Sanon Shines Like Peacock.. పొడగరే కానీ, సొగసరి.!
పొడగరి అయిన ముద్దుగుమ్మలకు అన్నిరకాల కాస్ట్యూమ్స్ సెట్ కాకపోవచ్చు. కానీ, పొడుగు కాళ్ల సుందరి కృతి సనన్ మాత్రం తనదైన ఆటిట్యూడ్‌తో ఎలాంటి కాస్ట్యూమ్‌కి అయినా సరికొత్త అందాన్ని అద్దేస్తుంటుంది.
కుచ్చులు కుచ్చులుగా డిజైన్ చేసిన ఈ పర్పుల్ కలర్ డ్రస్సులో కృతి సనన్ స్టైల్ వేరే లెవల్. అందుకే నెట్టింట ఈ అందమైన నెమలి పోజులకు కామెంట్లు పోటెత్తేస్తున్నాయ్.
తెలుగులో ఆరడుగుల ఆజానుబాహుడు మహేష్‌బాబుతో (Super Star Maheshbabu) ‘1 – నేనొక్కడినే’ (1 Nenokkadine) సినిమాతో ఈ పొడుగు కాళ్ళ సుందరి డెబ్యూ చేసిన సంగతి తెలిసిందే.
తర్వాత ‘దోచేయ్’ సినిమాలో అక్కినేని వారసుడు నాగచైతన్య (Akkineni Nagachaitanya) హీరోయిన్‌గా నటించింది. బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలూ నెగిటివ్ రిజల్ట్ ఇచ్చేసరికి తెలుగు తెరకు దూరమైపోయింది.
అలా మాయమై, ఇలా ప్రత్యక్షమై..
బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అనిపించుకుంది ఈ పొడగరి భామ. వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది సొగసుల కృతి సనన్.

అక్షయ్ కుమార్ సరసన ‘బచ్చన్ పాండే’ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. తెలుగులో సూపర్ హిట్ అయిన ‘గద్దలకొండ గణేష్’ సినిమాకి హిందీ రీమేక్ ఇది.
కృతిసనన్ (Kriti Sanon)నటించిన ‘లుకాచుప్పి’ (Luca Chuppi), ‘మిమి’ (MIMI Movie) సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కూడా సొంతం చేసుకుంది కృతిసనన్ ‘మిమి’ సినిమాతో.
Also Read: Genelia Deshmukh జెనీలియా అప్పుడలా.! ఇప్పుడేమో ఇలా.!
లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు తెరపై కృతి సనన్ సందడి చేయబోతోంది. ప్యాన్ ఇండియా స్టార్ ప్రబాస్ సరసన ‘ఆది పురుష్’లో కృతిసనన్ (Kriti Sanon Shines Like Peacock) నటిస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకుడు.