Table of Contents
Telugu Desam Party.. ఓ రాజకీయ పార్టీ నలభయ్యేళ్ళపాటు మనుగడ సాధించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. అంతటి ఘనతను సాధించడం కంటే, దాన్ని కొనసాగించడమే కష్టం.
స్వర్గీయ నందమూరి తారకరామారావు (Nandamuri Taraka Ramarao) 1983లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ, నలభయ్యేళ్ళ ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఇంతకీ, అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటి.? గతమెంతో ఘనం.! కానీ, భవిష్యత్తు ఎలా వుండబోతోంది.?
‘అబ్బే, ఇప్పుడున్నది స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీ కాదు.. ఇది ఎన్టీయార్ నుంచి చంద్రబాబు లాక్కున్న పార్టీ. ఇది చంద్రబాబు (Nara Chandrababu Naidu) పార్టీ తప్ప, ఎన్టీయార్ పార్టీ కానే కాదు.!’ ఈ చర్చ తరచూ జరుగుతుంటుంది.
Telugu Desam Party గతమెంతో ఘనం.. భవిష్యత్తే ప్రశ్నార్థకం.!
సరే, ఎవరి వాదన వారిది. ఎవర్నీ తప్పు పట్టలేని పరిస్థితి. ఒక్కటి మాత్రం నిజం. తెలుగుదేశం పార్టీకి (TDP) ఘనమెంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.!
నలభయ్యేళ్ళకు సరిపడే నాయకత్వాన్ని తయారు చేస్తాం.. యువత కదిలి రావాలి.. అప్పట్లో ఎన్టీయార్ పిలుపుకి స్పందించినట్లే, నేటి యువతరం కూడా స్పందించాలంటూ టీడీపీ ప్రస్తుత అధినేత నారా చంద్రబాబునాయుడు (N Chandrababu Naidu) పిలుపునిచ్చారు.
అప్పట్లో రాజకీయాలు ఎలా వున్నాయ్.? ఇప్పుడు రాజకీయాలెలా వున్నాయ్.? పూటకో పార్టీ మార్చే రాజకీయ నాయకులెక్కువైపోయారు. బూతులు తిడితే తప్ప రాజకీయాల్లో మనుగడ సాధించలేని పరిస్థితి నేటి తరం రాజకీయాల్లో కనిపిస్తోంది.
Telugu Desam Party రాజకీయాలంటే గౌరవమేదీ.?
రాజకీయాలంటే యువతకు అసహ్యం పుట్టింది తప్ప, రాజకీయాల పట్ల కనీస గౌరవం లేదు. ఆ గౌరవాన్ని సంపాదించేందుకోసం ఏ రాజకీయ పార్టీ కూడా కనిపించడంలేదు. టీడీపీ (TDP) కూడా ఇందుకు అతీతమేమీ కాదు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనల్ని మార్చుకోవాలి.. తప్ప, పార్టీ మూల సిద్ధాంతాలకు విరుద్ధంగా వెళితే ఎలా.? అన్న ప్రశ్న కొందరు సీనియర్ నేతల నుంచి వస్తున్నా, వాటిని పట్టించుకునేంత తీరిక, ఓపిక అధినేత చంద్రబాబులోనే లేదాయె.!
ఈసారి అధికారం దక్కకపోతే అంతే సంగతులు.!
టీడీపీ గనుక మళ్ళీ అధికారంలోకి వస్తే సరే సరి. లేదంటే అంతే సంగతులు. అసలు మళ్ళీ టీడీపీ అధికారంలోకి రావడానికి సరైన నాయకత్వమేది.?
నాయకులు వెళ్ళిపోయారు.. వాళ్ళతోపాటే క్యాడర్ కూడా. తెలంగాణలో పార్టీ గల్లంతయ్యింది.. ఏపీలో పరిస్థితీ దయనీయంగా తయారైంది. అయినా, డ్యామేజీ కంట్రోల్ చర్యలే లేవ్.!
వాస్తవానికి ఇప్పుడున్న రాజకీయాల్లో నాయకులు, క్యాడర్.. అంతా భూటకం.! ఎవరి అవసరాలకు తగ్గట్టు వాళ్ళు ఆయా పార్టీల్లో వుంటున్నారంతే. ఈ గందరగోళ రాజకీయాల్లో టీడీపీ (Telugu Desam Party) తిరిగి పుంజుకోవడమంటే కష్టమే.! కానీ, అసాధ్యమైతే కాదు.
Also Read: పవన్ కళ్యాణ్ గర్జిస్తే అవెందుకు మొరుగుతున్నాయ్.!
స్వర్గీయ ఎన్టీయార్ అంటే ఆరాధనా భావం, గౌరవం, భక్తి.. ఇంకేవేవో వుండేవి. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితులున్నాయా.? అవసరానికి భజన చేసే నాయకులు తప్ప.! టీడీపీ అనే కాదు, అన్ని పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. ఔను, అప్పటి టీడీపీ, ఇప్పటి టీడీపీ ఒకటి కాదు.
మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి.. అన్నట్టుగా టీడీపీ వ్యవహరిస్తే కుదరంతే.!