Amala Paul Life Style..‘చుట్టమల్లే కష్టమొస్తే కళ్ల నీళ్లు పెట్టుకుంటూ, కాళ్లు కడిగి స్వాగతించొద్దు.. అని అన్నాడో సినీ కవి. ఆయనెవరో కాదు, ప్రముఖ సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. ‘చిరునవ్వుతో’ సినిమాలోని పాట ఇది.
పాట సంగతి పక్కన పెట్టేసి, ‘అమలోక్తి’ గురించి మాట్లాడుకుందాం. నటి అమలా పాల్ చెప్పిన మంచి మాట కాబట్టి ‘అమలోక్తి’ అనేసుకున్నాం. ఇంతకీ అమలా పాల్ చెప్పిన ఆ మంచి మాట ఏంటబ్బా.!
ఫోటోలో చూస్తున్నారుగా.. ఓ చిన్న పడవలో కూర్చొని హుషారుగా కనిపిస్తోంది ఈ డస్కీ బ్యూటీ. ఒక్కతే ఈ చిన్న పడవని నడపడంలో కిక్కుని ఎంజాయ్ చేస్తోంది. పడవ ముందుకెలా వెళుతుంది.?
బలమంతా ఉపయోగించి నీటిలో తెడ్డును కదిపితే, దానికి అనుగుణంగా పడవ ముందుకు నడుస్తుంది.
‘కష్టాల కడలిని దాటేయాలంటే, ధైర్యంగా ముందడుగు వేయాలి. శక్తినంతా కూడదీసుకోవాలి..’ ఇదీ అమలా పాల్ (Amala Paul) ఈ ఫోటో ద్వారా చెప్పిన మంచి మాట.
అమలా పాల్.. అలా మొదలైంది.!
సినీ నటి అవ్వాలనుకునే ఆలోచన వచ్చీ రాగానే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ‘అద్దంలో నీ ముఖం చూసుకున్నావా.?’ అని చాలా మంది ఆమెను వెటకారంగా ప్రశ్నించారట.

డస్కీ బ్యూటీ అని పోర్ష్‌గా అంటాం కానీ, మరీ ఇంత నల్లగా వున్నావేంటీ.? అని వికారంగానే ఆమెపై సెటైర్లేశారట.
కెరీర్ తొలి నాళ్లలో ఆ పెదాలేంటీ అలా వున్నాయ్.. ఆ కళ్లేంటీ అలా వున్నాయ్..? అంటూ అమలా పాల్ శరీరంలోని ప్రతి భాగానికి వంకలు పెట్టేశారట.
ఎప్పుడైతే నటిగా పేరు తెచ్చుకుందో, ఎప్పుడైతే కమర్షియల్ విజయం దక్కించుకుందో తిట్టిన నోళ్లే అమలా పాల్‌ని పొగడడం మొదలెట్టాయ్.
సక్సెస్ ఫుల్ కెరీర్ అలా అలా సాగుతుండగానే, అనుకోకుండా ఈ డస్యీ బ్యూటీ వ్యక్తిగత జీవితంలో ఇబ్బందులు మొదలయ్యాయ్.
Amala Paul Life Style .. ప్రేమ, పెళ్ళి.. పెటాకులు.!
ప్రేమ వివాహం పెటాకులయ్యింది. మళ్లీ జీవితం అగమ్యగోచరం. ఇంకోసారి జీవితంలో ధైర్యంగా నిలబడేందుకు శక్తినంతా కూడదీసుకుంది. మానసికంగా తనను తాను ధృఢంగా మలచుకుంది డస్కీ బ్యూటీ అమలా పాల్ (Amala Paul).
తీస్తే నా జీవితం కూడా ఓ సూపర్ హిట్ బయోపిక్ అవుతుందని సరదాగా చెబుతుంటుంది అమలా పాల్. ‘నా నవ్వు వెనక ఇంత పెద్ద కథ వుంది..’ అంటే ఒక్కోసారి నేనే నమ్మలేను.. అని చెప్పడం అమలా పాల్‌కే చెల్లింది.
Also Read: నయనతార.! ఊ అంటావా.? ఉలిక్కి పడతావా.?
పై ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, ‘ధైర్యంగా ముందుకు సాగిపోండి..’ అంటూ క్యాప్షన్ పెట్టడాన్ని ఏదో సరదాగా చేసేయలేదట. తన అనుభవాల్లో ఇదొక చిన్న పాఠం అని అమలా పాల్ (Amala Paul) చెప్పకనే చెప్పింది. అద్గదీ అసలు సంగతి.