సీజన్ మొదలయినప్పటినుంచీ చాలా సందర్భాల్లో అబిజీత్, అఖిల్ సార్ధక్ (Abijeet Akhil Sarthak Bigg Fight) మధ్య విభేదాల్ని చూశాం. మధ్యలో మోనాల్‌ని పెట్టి.. ఈ కాంబినేషన్ మధ్య అనవసరమైన రచ్చకి బిగ్‌బాస్ నిర్వాహకులే ప్లాన్ చేశారు. వీకెండ్‌లో హోస్ట్‌గా నాగార్జున, కాస్త ఆజ్యం పోస్తూ వస్తున్నాడంతే.
గెస్ట్ హోస్ట్ సమంత కూడా తనవంతుగా ఆజ్యం పోసింది. సందర్భం దొరికితే చాలు, అఖిల్ – అబిజీత్ – మోనాల్ మధ్య యాగీ షురూ అవుతుంటుంది. దాదాపుగా ప్రతి నామినేషన్ సమయంలోనూ అఖిల్ – అబిజీత్ మధ్య మోనాల్ పేరు వస్తోంది.
మోనాల్ పేరు ప్రస్తావించకుండా అబిజీత్‌ని అఖిల్ నామినేట్ చేయలేకపోతుండడం బహుశా అఖిల్ వీక్‌నెస్ అయి వుండొచ్చు. ‘గేమింగ్ రిలేషన్‌షిప్’ అంటూ అఖిల్ ఓ మాట వాడాడు తాజా నామినేషన్ ఎపిసోడ్‌లో. సో, ఇక్కడ మేటర్ క్లియర్.. మోనాల్ విషయంలో అఖిల్ జస్ట్ పబ్లిసిటీ స్టంట్ చేస్తున్నాడు.
ఆ మాటకొస్తే, అఖిల్.. తన అవసరాల కోసం సోహెల్‌తో స్నేహం చేస్తాడు, మెహబూబ్‌తోనూ అదే చేశాడు. అబిజీత్‌తోనూ అదే వ్యవహారం నడపాలనుకున్నాడుగానీ, తేడా కొట్టేసింది. మేకలా వెళ్ళాను, పులిలా వచ్చాను.. అంటూ అదేదో ఘనకార్యంలా అఖిల్ సెలవిచ్చాడు.
కెప్టెన్సీ దక్కితే పులి అని కాదు అర్థం. ఓ టాస్క్ ఆడి కెప్టెన్ అయితే.. అప్పుడు కదా ‘పులి’ అనడానికి అవకాశం వుండేది. ‘మమ్మీ..’ అంటూ ఎలిమినేషన్‌కి భయపడి ఏడ్చేసిన అఖిల్‌ని పులి.. అని ఎలా అనగలం.? సీక్రెట్ రూంలో వుండి అఖిల్ ఏం చూశాడు? బిగ్‌బాస్ అతనికి ఏం చూపించాడు?
గత సీజన్లను ఫాలో అయి వచ్చిన కంటెస్టెంట్‌కి, సీక్రెట్ రూం సంగతి తెలియకుండా ఎలా వుంటుంది.? ఆ మాత్రం ఇంగితం లేకుండా ఎలా వ్యవహరించాడో ఏమో! అబిజీత్ కూడా అఖిల్‌తో అంత ఆర్గ్యుమెంట్ చేయకుండా వుంటే బావుండేది.
ఇక్కడ అబిజీత్ కూడా డిగ్నిటీ కోల్పోవాల్సి వచ్చింది. ఇవే మైనస్ పాయింట్స్ అయిపోతాయి. అబిజీత్‌ని రెచ్చగొట్టాలనే ఏకైక సంకల్పంతో వచ్చిన అఖిల్ (Abijeet Akhil Sarthak Bigg Fight, తాను అనుకున్నది కొంతవరకు సాధించాడుగానీ.. అభాసుపాలైపోయాడు.