బిగ్‌బాస్ అనేది కంటెస్టెంట్స్‌కి నిజంగానే చాలా పెద్ద వేదిక. ప్రతిరోజూ హౌస్‌మేట్స్‌ని బుల్లితెర వీక్షకులు చూస్తుంటారు. వారేం చేస్తున్నారన్నది గమనిస్తారు. అదే ఈ రియాల్టీ షో (Abijeet Real Hero BB4 Telugu) ప్రత్యేకత. ఆయా వ్యక్తుల ప్రవర్తన, జనంలోకి వెళుతుంది.
రెండో సీజన్ (Bigg Boss Telugu) విన్నర్ కౌశల్ మండా (Kaushal Manda), అంతకు ముందు సినిమాల్లో చేసినా, బిగ్‌బాస్‌తోనే మరింత పాపులర్ అయ్యాడు. అతని కోసం ఓ ఆర్మీ ఏర్పడింది. దానిక్కారణం, హౌస్‌లో అతని ప్రవర్తన. మిగతా హౌస్ మేట్స్ అంతా అతన్ని వ్యతిరేకించారు. కానీ, ఒంటరిగానే విజయం సాధించాడు.
కౌశల్‌తో పోల్చడం ఎంతవరకు సబబు.? అన్న విషయాన్ని పక్కన పెడితే, కాస్తో కూస్తో ఆ ఫ్లేవర్ అబిజీత్‌లో (Abijeet) కనిపిస్తోంది. బిగ్‌బాస్ అనే వేదికను చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. దీపావళి సందర్భంగా వీధి కుక్కల విషయంలో కాస్త జాలి చూపించమని అభ్యర్థించాడు.. అదీ హోస్ట్ నాగార్జున పర్మిషన్ తీసుకుని.
అది టెలికాస్ట్ అవుతుందా.? అవ్వదా.? అన్న విషయం కూడా అబిజీత్‌కి (Team Abijeet)తెలియదు. కానీ, చెప్పాడు. దాన్ని నాగార్జున కూడా అభినందించాడు. ‘మీ కారు కిందనో, మీ ఇంట్లో ఏదో మూలనో స్ట్రీట్ డాగ్స్ టపాసుల శబ్దాల భయంతో వుంటే, వాటిని దయచేసి తరిమెయ్యొద్దు..’ అంటూ బిగ్‌బాస్ వేదికగా విజ్ఞప్తి చేశాడు అబిజీత్.
ఎంత గొప్ప విషయమిది. ఇదేదో పబ్లిసిటీ స్టంట్ అని చాలామంది అనుకోవచ్చుగాక.! కానీ, సందర్భానుసారం ఇలాంటి విషయాలు చెబితే, ఆ విషయంలో మంచి వుంటే, అది జనానికి బాగా చేరుతుంది. సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా ఈ తరహా అభ్యర్థనలు చేయడం మామూలే.
కానీ, బిగ్ హౌస్‌లో (Bigg Boss Telugu 4) వుంటూ, బయటి పరిస్థితులపై అవగాహనతో ఓ మంచి విషయం చెప్పడమంటే చిన్న విషయం కాదు. సింపుల్‌గా ఆ బైట్‌ని కట్ చేసి పారేసే అవకాశం వుంటుందని తెలిసీ, ఓ మంచి విషయం చెప్పాలన్న తపన కలిగి వున్నాడంటే, నిజంగా అబిజీత్‌కి హేట్సాఫ్ చెప్పాల్సిందే.
అబిజీత్ ‘ఆటం బాంబ్’ అంటూ హౌస్ మేట్స్ తేల్చేశారు. కొందరేమో అతన్ని విలన్.. అనే ముద్ర వేయడానికి ప్రయత్నిస్తుంటారు. కానీ, అబిజీత్.. రియల్ హీరో.!
సీజన్ విన్నర్ (Bigg Boss Telugu 4 Winner) అవుతాడా.? లేదా.? అన్న విషయాన్ని పక్కన పెడితే, అబిజీత్ ఆల్రెడీ ఆడియన్స్ మనసుల్ని గెలిచేశాడు. అందుకే, ఎప్పుడు ఎలిమినేషన్ కోసం నామినేట్ అయినా.. భారీ ఓట్లతో సేవ్ అవుతున్నాడు.. దటీజ్ అబిజీత్.