బాబోయ్.. మామూలు క్లారిటీతో లేడు అబిజీత్. ఏ విషయమ్మీద అయినా కుండబద్దలుగొట్టేస్తాడు. అందుకేనేమో.. ఫిజికల్ టాస్క్‌లు ఆడకపోయినా, డాన్సులు చేయకపోయినా, కామెడీ చేయకపోయినా.. విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది అబిజీత్‌కి (Abijeet The Bigg Boss BB4).
అయితే, ఆ ఫాలోయింగ్‌ని నిలబెట్టుకోవడం అంత ఆషామాషీ కాదు. హౌస్‌లో మాట్లాడే ప్రతి మాటా కోట్లాది మందికి చేరుతోందనే విషయాన్ని అబిజీత్ గమనించాడు.. అందుకే, ప్రతి మాటా చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు.
‘ముందు ఒక మాట.. వెనక ఒక మాట చెప్పనుగాక చెప్పను.. ఎందుకంటే, బోల్డన్ని కెమెరాలున్నాయిక్కడ.. ఎవరూ చూడటంలేదని మనం అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం ఇంకోటుండదు..’ అని ఓ సందర్భంలో అబిజీత్ స్పష్టంగా చెప్పేశాడు.
ఇంత క్లారిటీతో వుండబట్టే, దాదాపుగా ప్రతి వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అవుతున్నా, కొందరు పనిగట్టుకుని అబిజీత్‌ని నామినేట్ చేస్తున్నా.. అశేషమైన అభిమానుల బలంతో సేఫ్ అవుతున్నాడు. తాజా ఎపిసోడ్‌లో ‘స్వాపింగ్’ అవకాశం వచ్చింది అబిజీత్‌కి. మోనాల్ (Monal Gajjar) లేదా సోహెల్‌తో (Syed Sohel Ryan)స్వాప్ చేసుకోవాలి.
కానీ, ‘నేనెవర్ని ఇతరుల ఆటని తక్కువగా చూసి చెప్పడానికి.?’ అని ఒక్క మాటలో తేల్చేశాడు అబిజీత్. ‘నీకూ నాకూ చాలా గొడవలున్నాయి. అయినాసరే, మీ అమ్మగారు నన్ను ఫేవరెట్ కంటెస్టెంట్ అన్నారు.. మదర్ లవ్.. నేను ఎక్కడో కనెక్ట్ అయిపోయాను. నేను నిన్ను స్వాప్ అవమని అడగలేను..’ అనేశాడు అబిజీత్, మోనాల్‌తో.
మిగతా కంటెస్టెంట్స్ మోనాల్‌తో అడ్డగోలుగా మాట్లాడేశారు. అబిజీత్ మాటలు నిజంగానే మోనాల్‌కి చాలా ఊరటనిచ్చాయి. అయితే, కెప్టెన్ హారిక (Harika Dethadi) డెసిషన్‌తో అబిజీత్ ప్లేస్‌లోకి మోనాల్ చేరాల్సి వచ్చింది. అలా మోనాల్, ఈ వారం ఎలిమినేషన్‌కి నామినేట్ అయ్యింది అరియానా (Ariyana Glory), అవినాష్ (Avinash), అఖిల్‌లతో (Akhil Sarthak) కలిసి.
అవకాశం వచ్చింది గనుక, ఏదో ఒక పనికిమాలిన కారణం చూపించేసి నామినేట్ చేయడం ఫ్యాషన్ అయిపోయిన బిగ్ హౌస్‌లో (Bigg Boss Telugu 4) అబిజీత్, అవకాశం వచ్చినా.. తాను సేవ్ అయ్యేందుకు ప్రయత్నించకపోవడం గొప్ప విషయమే కదా.! అందుకే, అబిజీత్‌కి అంతమంది అభిమానులు.
ఇఫ్పుడు ఆ అభిమానులందరి ముందూ పెద్ద టాస్క్ వచ్చిపడింది. అదే మోనాల్‌ని సేవ్ చేయడం. అబిజీత్ (Abijeet The Bigg Boss BB4) అభిమానులే కాదు, హారిక అభిమానులూ మోనాల్‌ని సేవ్ చేసి తీరాల్సిందే.. ఎందుకంటే, హారికని కెప్టెన్‌ని చేసింది మోనాల్ తెగువ మాత్రమే.
ఇద్దరు మగాళ్ళకు చేతకాని టాస్క్‌లో, మోనాల్.. సత్తా చాటి, హారిక కెప్టెన్ అవడంలో కీలక పాత్ర పోషించింది. ‘ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు హౌస్‌లో కొనసాగుతావు..’ అని అబిజీత్, హారిక (Alekhya Harika) ఆల్రెడీ మోనాల్‌కి భరోసా ఇచ్చేశారు. అభిమానులే, వారి మాటని నిలబెట్టాల్సి వుంది.