Adipurush First Review.. ప్రభాస్ సినిమా అంటే, అది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాదు.! భారతీయ సినిమా.! ఔను, ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్.!
ఆ ప్రభాస్ నుంచి తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చింది ‘ఆదిపురుష్’.! ఇంతకీ, ఈ సినిమా కథా కమామిషు ఏంటి.?
‘ఆదిపురుష్’ అంటే, ‘రామాయణం’లోని ఓ భాగాన్ని తీసుకుని, తెరకెక్కించిన సినిమా.! బాలీవుడ్ దర్శకుడు ఓ రౌత్ ఈ సినిమాని తెరకెక్కించాడు.
బాలీవుడ్ నటి కృతి సనన్ ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటించింది. శ్రీరాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి సనన్ నటించారు.
Adipurush First Review.. అసాధారణం.. ఈ సినిమా తెరకెక్కిన వైనం..
నిజానికి, ‘ఆదిపురుష్’ సాధారణమైన సినిమా కాదు.! అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఈ సినిమాని సరికొత్తగా తెరకెక్కించడం జరిగింది.
గ్రాఫిక్స్ వినియోగించి, ప్రభాస్ అలాగే కృతి సనన్ పాత్రల్ని డిజైన్ చేశారు. అంటే, కొన్ని చోట్ల హీరో హీరోయిన్లు.. నటించాల్సిన అవసరమే లేదన్నమాట.!

మరి, ఇంత కష్టపడి తెరకెక్కించిన ‘ఆదిపురుష్’ (Adipurush Review) సినిమా ఎలా వుంది.? చూసినవాళ్ళు ఏమంటున్నారు.?
టిక్కెట్ల ప్రీ-సేల్స్ పరంగా అయితే, ‘ఆదిపురుష్’ ప్రభంజనం మామూలుగా లేదు. ‘జై శ్రీరామ్’, ‘జై హనుమాన్..’ నినాదాలతో ప్రేక్షకులు థియేటర్ల వైపు పోటెత్తారు.
ఇదంతా సినిమా విడుదలకు ముందు. సినిమా థియేటర్లలోకి వచ్చేశాక పరిస్థితి ఏంటి.? తెలుసుకుందాం పదండిక.!
ఆశలన్నీ అడియాశలే..
కథ అందరికీ తెలిసిందే. నిజానికి ఇది కథ కాదు రామాయణం.! అందులోంచి కొంత భాగాన్ని తీసుకుని, వెండితెరకెక్కించారంతే.
ఈ క్రమంలో శ్రీరాముడి పాత్రనీ, సీతా దేవి పాత్రనీ.. మిగతా పాత్రల్నీ మోడ్రన్ టచ్ ఇచ్చి చూపించేందుకు ప్రయత్నించారు.
మార్వెల్ రామాయణ.. అనీ, ఇంకోటనీ.. ఏవేవో మాటల చెబుతూ వచ్చారు. తొలి అర్థ భాగం బాగానే వున్నా, రెండో అర్థ భాగం సాగతీతగా మారిపోయింది.
విజువల్ ఎఫెక్ట్స్ కొన్ని చోట్ల అత్యంత అధ్వాన్నంగా తయారయ్యాయి. మొబైల్ ఫోన్లలో అత్యద్భుతమైన వీఎఫ్ఎక్స్ చేసేస్తున్న రోజులివి.
Also Read: Ram Gopal Varma: ఆర్జీవీ.! కెలకడం సరదానా.? రోగమా.?
రామాయణం.. హిందుత్వం.. జై శ్రీరామ్.. జై హనుమాన్.. ఇలా ప్రచారం చేసుకుని, జనం సెంటిమెంట్లను సినిమాతో క్యాష్ చేసుకోవాలన్న అతృత మాత్రమే కనిపించింది..
నిజానికి రామాయణం.. అంటే, చాలా ఎమోషన్స్‌తో కూడుకున్నది. అదొక జీవన మార్గం. అనవసరపు హంగామాతో.. ఆదిపురుషుడి స్థాయి తగ్గించినట్లయ్యింది.
సినిమా థియేటర్లలో ప్రతి షో కోసం, హనుమంతుడికి ఉచిత టిక్కెట్ ఇవ్వడం కాదు, రామాయణం తాలూకు స్ఫూర్తిని నేటి తరానికి చాటి చెప్పేలా సినిమా తీసి వుండాల్సింది.