Adipurush OTT Release.. ‘ఆదిపురుష్’ మేనియా మొదలైపోయింది.! ‘జై శ్రీరామ్’, ‘జై హనుమాన్’ నినాదాలతో నార్త్ బెల్ట్ ఊగిపోతోంది.!
రేప్పొద్దున్న థియేటర్లలో సినిమాని తెరపై చూస్తున్నప్పుడు.. ప్రత్యేక పూజలు కూడా చేసేసేలా వున్నారు అభిమానులు.!
సినిమాని ఇలా చూడాలంటూ.. కొన్ని ‘గైడ్‌లైన్స్’ సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. వాటిని ఫన్నీగా చూడాలా.? సీరియస్‌గా తీసుకోవాలా.? అన్నది అర్థం కావట్లేదు.
కొబ్బరికాయలు, పూలు.. అంతేనా, హారతులు.. ఇలాంటి వాటి గురించి చర్చించుకుంటున్నారు ఆ గైడ్‌లైన్స్‌లో.!
Adipurush OTT Release.. థియేటర్లకు ఇలా రండి.!
ఇంకా చాలా వుంది. సంప్రదాయ వస్త్రధారణలో మాత్రమే థియేటర్లకు రావాలంటూ నెటిజనం చర్చించుకుంటున్నారు. ఇదండీ వరస.!
ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. థియేటర్ల మీద అసహ్యంతో.. ఓటీటీ వైపు మొగ్గు చూపుతున్నారు చాలామంది ప్రేక్షకులు.!
ఎప్పుడొచ్చినాసరే, ఓటీటీలోనే చూద్దాం.. థియేటర్లకు వెళ్ళే ఓపిక లేదనుకుంటున్నారు.!
వాళ్ళకోసమేనా.. అన్నట్లు, సినిమా విడుదలకు ముందే ‘ఓటీటీ రిలీజ్ ఎప్పుడు.?’ అన్న చర్చ తెరపైకొస్తోంది.!
ఇదే సినిమాని చంపేస్తోంది.!
Mudra369
ఓ వైపు ‘ఆదిపురుష్’ మేనియా ఇలా వుంటే, ఇంకో వైపు, ‘ఆదిపురుష్’ ఓటీటీ రిలీజ్ గురించిన రచ్చ అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది.
మీకు తెలుసా.? ‘ఆదిపురుష్’ నాలుగంటే.. నాలుగు వారాల్లోనే ఓటీటీలో వచ్చేయబోతోంది.. అన్నది ఓ ప్రచారం తాలూకు సారాంశం.

కాదు కాదు, 8 వారాల తర్వాతే ‘ఆదిపురుష్’ ఓటీటీలోకి వస్తుందంటూ ఇంకో వివరణ.! ఏది నిజం.? అది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది.
సినిమాని అప్పుడే చూస్తారట.!
సినిమాని థియేటర్లలోనే చూడాలి.. వెండితెరపై చూస్తేనే, ఆ అద్భుత దృశ్య కావ్యం ఇంకా అద్భుతంగా కనిపిస్తుందన్నది నిర్మాతల వెర్షన్.
Also Read: ఏంటి నిఖిలూ.! నిన్ను నువ్వే చెడగొట్టుకుంటున్నావ్.!
ఫస్ట్ గ్లింప్స్, టీజర్లు, ట్రెయిలర్లు.. వీటన్నిటినీ చూసి విసిగిపోయినోళ్ళకి, ‘థియేటర్లలో చూసేంత గొప్ప బొమ్మ కాదు’ అని అనిపించడంలో వింతేముంది.?
8 వారాల తర్వాతే సినిమా రిలీజయ్యిందనుకుని, ఓటీటీలోనే చూస్తామంటూ కొందరు నెటిజన్లు నిట్టూరుస్తున్నారు. ఇదండీ వరస.!
ఒక్కటి మాత్రం నిజం.. ఈ ఓటీటీ ప్రచారంతో, డిస్ట్రిబ్యూటర్లు వణికిపోతున్నారు. దాంతో, ‘8 వారాల తర్వాతగానీ, సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయబోం’ అని నిర్మాతలు చెప్పుకోవాల్సి వస్తోంది.!