Adipurush Raavan Ten Heads పది తలల రావణుడు.! ఇది చాలా సినిమాల్లో చూశాం.. టీవీ సీరియల్స్‌లోనూ తిలకించాం.!
ఇంతకీ, ‘ఆదిపురుష్’ సినిమాలోని రావణుడెలా వుంటాడు.? మామూలుగా అయితే, ఒకదాని పక్కన ఒకటి.. అసలు తలకాయకు అటూ ఇటూ.. మొత్తంగా అన్నీ కలిపి పది తలకాయలుంటాయ్.!
పది తలకాయలు నిజంగా వుంటాయా.? అంటే, బ్రహ్మకి అన్ని తలకాయలు వుంటాయా.? అని ప్రశ్నించుకోవాల్సి వస్తుంది.. అది వేరే సంగతి.
Adipurush RaavanTen Heads.. తాటి ముంజల్లా వున్నాయేంటి.?
సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ చాలానే కనిపిస్తున్నాయి.. ‘ఆదిపురుష్’లోని రావణుడి (Adipurush Ravan) గురించి.! అది సమంజసం కాదు కదా.. అందుకే, ఇక్కడ పోస్ట్ చేయడంలేదు.
ఇక్కడ మీరు చూస్తున్నది మాత్రం.. నిజం తాటికాయల్ని.! అచ్చం ఇలానే డిజైన్ చేసినట్టున్నారు సినిమాలోని రావణుడి పది తలకాయల్ని.!
Also Read: Rashmika Mandanna.. ఆ చూపేంటి! అలా క్రష్ చేసేస్తావేంటీ.!
బాబోయ్… ఇదేం ట్రోలింగ్ అంటే.. అంతే మరి.! ఆ స్థాయిలో దర్శకుడు, రావణుడ్ని కామెడీ చేసినప్పుడు.. సినిమాని ట్రోల్ చేయకుండా వుంటారా నెటిజనం.?
ఔను, అచ్చంగా తాటి కాయల్లానే.. అడ్డదిడ్డంగా రావణుడి (Om Raut Aadipurush Raavan) తలకాయల్ని వీఎఫ్ఎక్స్‌లో అతికించేశారు.
తాటికాయల వ్యవహారమొక్కటే కాదు.! చాలా వున్నాయ్. రావణుడు (Adipurush Raavan) సరదాగా పాములతో శరీరానికి మాలిష్ చేయించుకుంటాడండోయ్.!
అంతేనా, మొహానికి ‘వెల్డింగ్ షాపులో’ వినియోగించే లాంటి మాస్క్ కూడా ధరించేస్తాడు ఓం రౌత్ (Om Raut) తీర్చిదిద్దిన రావణుడు.!
వామ్మో.. ఇన్ని కామెడీలా.? కడుపు చెక్కలయిపోతుంది నవ్వడానికి. కామెడీ అనుకుని, సినిమాకి వెళ్ళాలనుకుంటున్నారా.? అయితే, మీ ఖర్మ.!
ఈ రావణుడ్ని చూశారా.?
ఓ వైపు తాటికాయల వ్యవహారం నడుస్తోంటే.. ఇది చూడు.. అంటూ, ఓ ఫొటోని సోషల్ మీడియాలో ప్రబాస్ అభిమానులు షేర్ చేస్తున్నారు.

పది తలకాయల రావణుడు.. ఇలాక్కూడా వుంటాడని అనేక శిల్పాలు చెబుతున్నాయన్నది వారి వాదన.
ఎవరి గోల వారిదే.! విషయమిక్కడ పది తలకాయలు ఎలా వున్నాయన్నది కాదు.. రావణ బ్రహ్మని వీఎఫ్ఎక్స్ పేరుతో ఎంత కామెడీ చేశాడనన్నదే ముఖ్యం.