Table of Contents
Adipurush.. అసలేమయ్యింది ప్రభాస్‌కి.? ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నాడు.? ‘ఆదిపురుష్’ టీజర్ విడుదల కాగానే చాలామందికి వచ్చిన డౌట్ ఇది.!
కేవలం 24 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టింది ‘ఆదిపురుష్’ టీజర్.! అదొక్కటే సరిపోతుందా.? అందులో కంటెంట్ వుండొద్దూ.?
కంటెంట్ వున్నా, లేకున్నా.. ప్రభాస్ సినిమా కదా, ‘ఆదిపురుష్’ సినిమాపై ఆ మాత్రం అంచనాలుంటాయ్.. అందుకే, టీజర్‌కి వ్యూస్ పోటెత్తుతున్నాయ్.
Adipurush.. ‘కొచాడియాన్’కీ.. ‘ఆదిపురుష్’కీ పోలికేంటి.?
రజనీకాంత్ (Superstar Rajnikant) నటించిన ‘కొచాడియాన్’ సినిమా గుర్తుంది కదా.? అదేదో మోషన్ క్యాప్చర్ విధానమట.. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, వీఎఫ్‌ఎక్స్ సినిమా తీసేశారు.
కానీ, ఆ ‘కొచాడియాన్’ భారీ అంచనాల నడుమ విడుదలై ఫ్లాప్ అయ్యింది. మరి, ‘ఆదిపురుష్’ పరిస్థితీ అంతేనా.?
నాన్సెన్స్, ‘కొచాడియాన్’ వేరు, ‘ఆదిపురుష్’ వేరని మేకర్స్ చెబుతున్నాగానీ, నమ్మేలా లేరు జనం. ఎందుకంటే, ‘ఆదిపురుష్’ టీజర్ కూడా అలాగే వుంది మరి.
పాత్రల్లో ఆ జీవం కనిపించడంలేదేంటి.?
పైగా, ‘ఆదిపురుష్’లోని రాముడు, సీత, రావణుడు, ఆంజనేయుడు.. ఇలా ఏ పాత్రలోనూ జీవం కనిపించడంలేదు. ‘జీవం’ అంటే, హిందుత్వం.!
హాలీవుడ్ సినిమాల్లోని పాత్రలకు దగ్గరగా వుండేలా, వీటిని డిజైన్ చేయడమే పెద్ద సమస్య. రామాయణమేంటి.? ఆ వెర్రి వేషాలేంటి.? అన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
ప్రభాస్ (Prabhas), కృతిసనన్ (Kriti Sanon), సైఫ్ అలీఖాన్ (Saif Ali Khan).. ఇలాంటి తారాగణాన్ని పెట్టుకుని, ఇంత నాసిరకం సినిమా ఏంటన్న చర్చ ‘ఆదిపురుష్’ టీజర్‌తో షురూ అయ్యింది.
అక్షింతలు బాగానే పడుతున్నాయ్..
ఫిలిం మేకర్ ఓం రౌత్‌కి సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల నుంచి అక్షింతలు పడుతున్నాయి. ‘బాయ్‌కాట్ ఆదిపురుష్’ అనే డిమాండ్లూ పెరుగుతున్నాయ్.
ఇదేం వేలం వెర్రి.? ఈ వెర్రి కేవలం బాయ్‌కాట్ ఆదిపురుష్.. అంటున్నవాళ్ళదే కాదు, సినిమాని తీసినవాళ్ళది కూడాను.!
అత్యంత భారీ బడ్జెట్‌తో, అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఆదిపురుష్’ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు చిత్ర దర్శక నిర్మాతలు చెబుతూ వస్తున్నారు.
Also Read: Anu Emmanuel.. టైటిల్ మారింది.! పాప ఫేటు మారేనా.?
ఏదీ ఆ భారీ బడ్జెట్.? ఏదీ ఆ ప్రతిష్టాత్మక నిర్మాణం.? అప్పుడెప్పుడో రామ్ చరణ్ అభిమానులు తయారు చేసిన ఓ పోస్టర్‌ని యధాతథంగా కాపీ కొట్టేసి వదిలేసింది ‘ఆదిపురుష్’ టీమ్.!
ఇదా క్రియేటివిటీ.? ఇదా భారీతనం.? అన్న ప్రభాస్ అభిమానుల ప్రశ్నలకు సమాధానం చెప్పేదెవరు.?
చాలా ఏళ్ళ క్రితం వచ్చిన ‘రామాయణం’ టీవీ సీరియల్ బెటరనే చర్చ జరుగుతోందంటే, ‘ఆదిపురుష్’ టీమ్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిందే.