Aditi Rao Hydari Glamarasam.. ఏమా రాజసమ్.! ఏమని చెప్పాలి ఆ అందమ్. నిజంగా సమ్మోహనమ్.!
అదితీ రావు హైదరీ. అచ్చమైన హైద్రాబాదీ అందమిది. చాలా హిందీ సినిమాల్లో హీరోయిన్గా నటించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందం.
వస్తూ వస్తూనే ఏదో ‘సమ్మోహనం’ కలిగించింది. ఇదే అదితీ రావ్ హైదరీ నటించిన తొలి తెలుగు చిత్రం. సుధీర్ బాబు హీరోగా నటించాడు.
రీల్ లైఫ్ హీరోయిన్గా చాలా చాలా అందంగా కనిపించి తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహించింది ఈ సినిమాతో అదితీ రావ్ హైదరీ.
Aditi Rao Hydari Glamarasam.. అందమ్.. హుందాతనమ్.!
ఆ తర్వాత ‘మహాసముద్రం’, ‘వి’.. ఇలా పలు తెలుగు చిత్రాల్లో నటించింది. అన్నింటికీ మించి అదితీ రావు హైదరీ నటించి వెబ్ సిరీస్‌లు ఎవ్వర్ గ్రీన్ అని చెప్పొచ్చు.

‘తాజ్’ వెబ్ సిరీస్‌లో అదితీ నటన, హావ భావాలు, రాజసం.. వావ్ సో గ్రేట్ అనిపిస్తాయ్. ఆ తర్వాత వచ్చిన ‘జూబ్లీ’ కూడా ఆ తరహాలోనిదే.
ఈ వెబ్ సిరీస్‌లలో అదితీ రావు హైదరీ తనదైన డిగ్నిటీ లుక్స్‌తో ఆకట్టుకుంది. ‘హీరామండి’ వెబ్ సిరీస్ నెక్స్ట్ లెవల్ అని చెప్పుకోవచ్చు. వేశ్య పాత్రలో అదితీ రావు హైదరీ నటించింది ఈ వెబ్ సిరీస్‌లో.
అందానికి అదో అడిషన్.!
ఇక ప్రస్తుతం ‘ఓ సాతీ రే’ అను ఓ రొమాంటిక్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. అలాగే, కొన్ని హిందీ సినిమాలూ, అదితీ చేతిలో వున్నాయ్.
సినిమాల సంగతెలా వున్నా.. నెట్టింట అదితీ రావు హైదరీ చేసే అందాల హంగామా అంతా ఇంతా కాదు. అందమొక్కటే కాదండోయ్.
అందంతో పాటూ, వుండే ఆ హుందాతనం వుంది చూడండీ.. అదే అదితీలోని అసలు సిసలు స్పెషాలిటీ.!
ఆ హుందాతనం, ఆమెలోని అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంటుంది. కొన్ని కొన్ని పాత్రల్లో అదితీని చూస్తే.. ఆ పాత్రలో మరో నటి గుర్తుకు రాదన్నంతలా ఒదిగిపోతుంది.
అదితి నటించిన పీరియాడిక్ వెబ్ సిరీసులు ఆ విషయాన్ని హండ్రెడ్ పర్సంట్ ప్రూవ్ చేస్తాయ్. తాజాగా నెట్టింట పార్టీ వేర్లో వైరల్ అవుతున్న పిక్స్‌లోని అదితీ లుక్స్ కూడా ఆ కేటగిరిలోకే వస్తాయ్.
